Salaar2 : శౌర్యాంగ పర్వం.. మొదలవుతోంది.. రెబల్ ఫ్యాన్స్ గెట్ రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస భారీ ప్రాజెక్టులతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్, తాజాగా తమ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘సలార్ 2’ పై కీలక ప్రకటన చేసింది. ఓ ఇంటర్వ్యూలో నిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించడంతో, రెండో భాగాన్ని అంతకు మించిన స్థాయిలో అత్యంత భారీ చిత్రంగా తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read : Ranabali : పెళ్లి తో వచ్చిన పబ్లిసిటీ… సినిమాకు ఫ్రీ ప్రమోషన్.. పెరిగిన బడ్జెట్
Also Read
దర్శకుడు ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ మరియు క్వాలిటీ విషయంలో రాజీపడరని.. ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. గతంలో సినిమా ఆలస్యం అవుతుందంటూ వచ్చిన వదంతులను కూడా ఆయన కొట్టిపారేశారు. ప్రశాంత్ నీల్ సెట్ చేసే హై స్టాండర్డ్స్ వల్లే కొంత సమయం తీసుకున్నామని, ప్రభాస్‌తో హోంబలే ఫిలిమ్స్ కుదుర్చుకున్న మల్టీ-ఫిలిం డీల్‌లో భాగంగా ఈ ప్రాజెక్ట్ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని వెల్లడించారు. ‘కేజీఎఫ్’, ‘కాంతార’ వంటి సినిమాలతో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ, ‘సలార్ 2’తో మరో మైలురాయిని అందుకోవాలని చూస్తోంది. అయితే, బాక్సాఫీస్ దగ్గర భారీ విజాయిన్ని అందుకున్న సలార్ సినిమా.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. అందుకే.. “సలార్ 2”ను అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నట్టుగా నిర్మాత స్పష్టం చేశారు. మొత్తానికి, ‘సలార్ 2’ షూటింగ్ ప్రారంభంపై అధికారిక ప్రకటన రావడంతో అభిమానులు పండగ చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్న నీల్.. అది అయిపోయాక సలార్ 2 స్టార్ట్ చేయనున్నాడు.
తాజావార్తలు
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్‌లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
-
Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!