Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పుటి నుంచి ఒక మాఫియా పాలనా చేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆటవిక రాజ్యం సృష్టిస్తున్నారని… వీరి అరాచకాలపై ఢిల్లీలో పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. ఇంటింటికి డబ్బులు, పథకాలు వచ్చేవీ అవన్నీ మాయం అయ్యాయన్నారు. ఈ నాలుగు నెలల్లో వందమందికి పైగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయన్నారు.శాంతిభద్రతలు రాష్ట్రంలో ఎక్కడున్నాయని ప్రశ్నించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ ఏదో జరుగుతుందని హెలికాప్టర్ పంపారు.. 5 నెలలు అయ్యింది ఏం పట్టుకున్నారని ప్రశ్నించారు. తిరుమల లడ్డుపై అసత్య ప్రచారాన్ని చేశారంటూ మండిపడ్డారు. ఏదో ఒక అసత్య ఆరోపణలు చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. చంద్రబాబు కనీసం బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. త్వరలో ఎన్నికలు వచ్చేటట్లు ఉన్నాయి.. ప్రతి కార్యకర్త సిద్దంగా ఉండాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డంగా దోచుకుని జేబులు నింపు కుంటున్నారన్నారు. జగన్ సహా పార్టీ నేతలు వ్యక్తిత్వ హననం చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆక్రమ కట్టడాలు చేయలేదు, కరకట్ట అక్రమ కట్టడంలో చంద్రబాబు ఉంటున్నారన్నారు.
Read Also: Vijayasai Reddy: 2027 ఆఖరిలో మళ్లీ ఎన్నికలు.. ఊహించని విజయం సాధిస్తాం..
జగన్మోహన్ రెడ్డి కట్టించిన ఋషి కొండ భవనాలు చూసి చంద్రబాబు సంతోషపడ్డారని చెప్పారు. అసెంబ్లీ భవనాలు చూస్తే ఆయన పాలన అర్థం అవుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన వేల కోట్ల సంక్షేమంతో పోల్చుకోగలవా చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ ఎక్కడా అమలు లేదన్నారు. ఈ ఐదు నెలల్లో 53వేల కోట్లు అప్పు చేశాడన్నారు. రోజూ అప్పు చేస్తున్నారని, ఏమై పోతున్నాయని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు నిర్మాణాత్మకంగా ఉన్నాయన్నారు. పార్టీ బలోపేతానికి, జవసత్వాలతో పార్టీ నిర్మాణం చేస్తామన్నారు. బలమైన పార్టీ కార్యకర్తలు గల పార్టీగా ఈసారి అధికారంలోకి రాగానే చేస్తామన్నారు. ఈ నేలలో పుట్టినా చంద్రబాబుకు ఏ రోజు మమకారం లేదని విమర్శించారు. పటిష్టమైన కార్యకర్తలన్న పార్టీని సిద్ధం చేస్తున్నాం, ఇదే మా తొలిఅడుగు అని అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి నేతృత్వంలో మరింత బలోపేతం చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో విజయం కూడా వైసీపీదే అంటూ ధీమా వ్యక్తం చేశారు.