Sajjala Ramakrishna Reddy: రాజధాని విషయంలో మాకు స్పష్టమైన వైఖరి ఉంది.. క్లారిటీ ఇచ్చిన సజ్జల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో పాలక, ప్రతిపక్షాల మాట యుద్ధం నడుస్తూనే ఉంది.. అయితే, రాజధాని విషయంలో తమ పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ బలోపేతంపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం చేశారు. అయితే, అమరావతి పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాశ్వతంగా దోపిడీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయితే, మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని గ్రోత్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తూ మెగా సిటీగా తీర్చిదిద్దాలనే ఆలోచనను వివరించారు.
Read Also: Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త.. రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తక్కువ ఖర్చుతో రియల్ క్యాపిటల్ సాధ్యమవుతుందని, అమరావతి ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంపై భారీ అప్పుల భారం పడుతోందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలను గ్రామగ్రామానికి తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు సూచించారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇక, తిరుమల అంశంపై కూడా ఆయన స్పందించారు. తిరుమల పవిత్రత రోజురోజుకీ దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏప్రిల్ 4న రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
మరోవైపు, పార్టీ బలోపేతంపై మాట్లాడుతూ, కమిటీల నిర్మాణం దాదాపు పూర్తయ్యిందని తెలిపారు సజ్జల. మొత్తం 18 లక్షల క్రియాశీల సభ్యత్వం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 13 లక్షల సభ్యుల డేటా సేకరించినట్లు చెప్పారు. త్వరలో సభ్యులకు ఐడీ కార్డుల ముద్రణ, పంపిణీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా గ్రామస్థాయిలో ప్రచారాన్ని మరింత పెంచాలని, ఓటర్ల జాబితాలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. బీఎల్‌వోలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలని, కొత్త ఓటర్ల నమోదు జాగ్రత్తగా చేపట్టాలని అన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..