Sai Dharam Tej : మెగా మేనల్లుడిగా తెరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్.. అనతి కాలంలోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా సినిమాకు తనలోని నటనను మెరుగుపరుచుకుంటూ అగ్రహీరోగా ఎదుగుతున్నారు. బైక్ యాక్సిడెంట్ తో ప్రాణాపాయం నుంచి బయట పడిన తర్వాత నటించిన తొలి చిత్రం విరూపాక్ష. ఈ రోజు సినిమా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సమయంలోనే రాజకీయాలపై తనకున్న అభిప్రాయాన్ని తెలిపారు.
Read Also: Allu Arjun : కూతురితో అల్లు అర్జున్.. క్యూట్ వీడియో
తనకు రాజకీయాలపై ఎలాంటి అవగాహన లేదన్నారు. తనకు తెలిసింది కేవలం సినిమాలు, క్రికెట్ మాత్రమేనన్నారు. అయితే తన మేనమామ.. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి కార్యకర్తగా తన సహకారం అందిస్తానన్నారు. గతంలోనే పవన్ ఇంట్రెస్ట్ ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని సూచించాడని.. అదే సమయంలో రెండు పడవలపై ప్రయాణం చేయొద్దని తనతో పవన్ చెప్పినట్లు సాయి ధరమ్ తేజ్ తెలిపారు. ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రచారానికి పవన్ మామ పిలిస్తే ఖచ్చితంగా వెళ్తానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
Read Also: Sumitra Pampana : ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ ఇంట్లో చోరీ.. కిలోల కొద్ది బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు