Ilayaraja : ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట విషాదం చోటుచేసుకుంది. ఇళయరాజా అన్న కొడుకు పావళర్ శివన్ మంగళవారం అకస్మాత్తుగా మృత్యువాత పడ్డాడు. పావలర్ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పావళర్ శివన్ గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఇళయరాజా అన్నయ్య, పావళర్ శివన్ తండ్రి పేరు పావళర్ వరదరాజన్. ఆయన కూడా సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, గాయకుడిగా పనిచేశారు.
Read Also:Kakinada Crime: కాకినాడలో మహిళపై అత్యాచారం.. వీడియో వైరల్
ఇళయరాజా సంగీత ప్రయాణానికి అతని అన్నయ్య పావాలార్ వరదరాజన్ ఎంతో సపోర్ట్ చేశారు. ఆయన 1973లో కన్నుమూశారు. వరదరాజన్ కు ఇద్దరు కుమారులు కాగా ఒకరు 2020లో కిడ్నీ సమస్యతో మరణించగా.. తాజాగా మరో కుమారుడు శివన్ తుదిశ్వాస విడిచారు. శివన్ అకస్మాత్తుగా గుండెపోటుకి గురికావడంతో మంచం మీది నుంచి పడిపోయినట్లు తెలుస్తోంది. దీనితో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. శివన్ అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు.
Read Also:Same Gender Marriage: గే కమ్యూనిటీ సమస్యలపై కమిటీ ఏర్పాటు.. సుప్రీంకు తెలియజేసిన కేంద్రం
శివన్ మంచి గిటారు ప్లేయర్. ఆయన ఇళయరాజా మ్యూజిక్ టీంలోనే కొనసాగుతున్నారు. సంగీత దర్శకుడిగా కూడా రెండు మూడు చిత్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ సక్సెస్ కాలేదు. శివన్ కుటుంబ సభ్యులతో కలసి పాండిచ్చేరిలోనే నివాసం ఉంటున్నారు. అన్న కొడుకు మరణించడంతో ఇళయరాజా దిగ్భ్రాంతికి గురైనట్లు తెలుస్తోంది. ఆయన మృతితో తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.