Russia Poseidon Missile: ఇటీవల కాలంలో రష్యా నిరంతరం అణ్వాయుధ సామర్థ్య ఆయుధాలను ప్రయోగిస్తోంది. రష్యా ఇప్పుడు ఖబరోవ్స్క్ అనే కొత్త అణు జలాంతర్గామిని ప్రయోగించింది. దీనికి పోసిడాన్ అణు డ్రోన్ అమర్చారు. ఏ తీరప్రాంత దేశాన్నైనా నాశనం చేయగల సామర్థ్యం ఈ క్షిపణి సొంతం అని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే పోసిడాన్‌ను “డూమ్స్‌డే క్షిపణి” అని కూడా పిలుస్తున్నారు. ఈ జలాంతర్గామిని రష్యా సముద్ర శక్తి, భద్రతను పెంచడానికి రూపొందించినట్లు సైన్యం పేర్కొంది. రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ డిమిత్రి మెద్వెదేవ్ పోసిడాన్ డ్రోన్‌ను “డూమ్స్‌డే క్షిపణి” అని పిలిచారు. రష్యా రక్షణ కమిటీ, డూమా ఛైర్మన్ ఆండ్రీ కర్తపోలోవ్ మాట్లాడుతూ.. ఈ డ్రోన్ మొత్తం తీరప్రాంత దేశాలను నాశనం చేయగలదని వెల్లడించారు.
READ ALSO: Maldives Smoking Ban: సిగరెట్ తాగే వారికి బిగ్ షాక్.. వారికి లైఫ్ టైమ్ నిషేధం!
ఈ జలాంతర్గామిని రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్ ప్రారంభించారు. ఈ ప్రయోగ కార్యక్రమంలో రష్యన్ నేవీ చీఫ్ అడ్మిరల్ అలెగ్జాండర్ మొయిసేవ్, సీనియర్ షిప్ బిల్డింగ్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెలౌసోవ్ మాట్లాడుతూ.. రష్యాకు ఇది ముఖ్యమైన రోజు అని అన్నారు. ఈ కొత్త జలాంతర్గామి దేశ సముద్ర సరిహద్దుల భద్రతను మరింత పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ జలాంతర్గామిని రూబిన్ సెంట్రల్ డిజైన్ బ్యూరో ఆఫ్ మెరైన్ ఇంజినీరింగ్ రూపొందించింది. ఇది నావికా కార్యకలాపాలను నిర్వహించడానికి ఆధునిక ఆయుధాలు, రోబోటిక్ పరికరాలతో అమర్చారు. ఈ జలాంతర్గామిని భారతదేశ విమాన వాహక నౌక INS విక్రమాదిత్యను తిరిగి అమర్చిన స్థలం సెవ్మాష్ షిప్‌యార్డ్‌లో నిర్మించారు.
ఇటీవల రష్యా పోసిడాన్ నీటి అడుగున విజయవంతంగా పరీక్షించింది. ఈ డ్రోన్ జలాంతర్గాములు, ఆధునిక ఫిరంగిదళాల కంటే వేగంగా ప్రయాణించగలవు. అలాగే లోతైన నీటిలో ఎక్కువ దూరం ప్రయాణించగలవు, సుదూర దాడులను నిర్వహించగలవు. ఈ డ్రోన్లను రష్యా ప్రధానంగా ఖబరోవ్స్క్-తరగతి జలాంతర్గాములపై మోహరించనుంది. గత 12 రోజుల్లో రష్యా మూడు ప్రధాన ఆయుధ ప్రయోగాలను ప్రయోగించింది. గతంలో రష్యా అణ్వాయుధాలను మోసుకెళ్లగల పోసిడాన్ టార్పెడో, బురెవెస్ట్నిక్ క్షిపణిని పరీక్షించింది. పోసిడాన్ అణు రియాక్టర్ వ్యూహాత్మక జలాంతర్గామిలోని రియాక్టర్ కంటే 100 రెట్లు చిన్నదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు.
READ ALSO: Tempo Traveller Crash: కర్నూల్ బస్సు ప్రమాదం మరవ ముందే మరో ఘోరం.. 15 మంది మృతి!