Govt on Congress: ‘‘మెలోని’’పై కాంగ్రెస్ జోక్ వివాదం.. స్పందించిన విదేశాంగ శాఖ..
- జార్జియా మెలోనిపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రం..
- భారత్, ఇటలీ మధ్య బలమైన సంబంధాలున్నాయన్న విదేశాంగ శాఖ..
- ద్వైపాక్షిక సంబంధాల్లో పరస్పర గౌరవం, అవగాహన కీలకమని వ్యాఖ్య..
- రాహుల్ గాంధీ ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Govt on Congress: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ‘‘మనకు ఇటలీతో బలమైన సంబంధాలు ఉన్నాయి. వాటిని మరింత బలోపేతం చేయాలనుకుంటున్నాము. ద్వైపాక్షిక సంబంధాల్లో పరస్పర గౌరవం, అవగాహన ఎంతో ముఖ్యం. ఏ విషయాన్నైనా గౌరవంగా ముందుకు తీసుకురావాలి’’ అని విదేశాంగ ప్రతినిధి అన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీ విదేశాంగ విధానంపై విమర్శలు చేస్తూ జార్జియా మెలోని ప్రస్తావన తీసుకువచ్చారు.
గురువారం ఢిల్లీలో క్రియేటివ్ కాంగ్రెస్ సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. విదేశాంగ విధానం అంటే కౌగిలించుకోవడం అనే ఆలోచన ఆయన బుర్రలోకి ఎలా వచ్చింది? అంటూ వ్యాఖ్యానించారు. సెటైరికల్‌గా కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్‌ను స్టేజ్‌పై కౌగిలించుకున్నారు. అయితే, ఆ సమయంలో సందీప్ దీక్షిత్ రాహుల్ గాంధీతో ‘‘నన్ను మీరు మెలోనీ అనుకోలేదు కదా?’’ అని అన్నారు. దీంతో అక్కడ ఉన్న వారంతా నవ్వారు. దీనికి సమాధానంగా రాహుల్ గాంధీ..‘‘నేను ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు’’ అని అన్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
కాంగ్రెస్, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తూ, దేశాన్ని నడిపించడానికి పరిణతి చెందిన నాయకత్వం అవసరమని అన్నారు. ప్రధాని మోదీని అవమానించే వ్యాఖ్యలు చేయడం ద్వారా రాహుల్ గాంధీ దేశ ప్రజలను కూడా అవమానిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గతంలో పలువురు విదేశాల అధినేతల్ని ఆలింగనం చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!