త్వరలో ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు ఏపీ ఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు అన్నారు. ఆర్టీసీ ఎండి తిరుమల రావు తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న తిరుమల రావు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Read Also: High alert in Old City: పాతబస్తీలో మొదలైన ప్రార్థనలు.. అడుగడుగునా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్
త్వరలోనే తిరుమల ఘాట్ రోడ్డులో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతామని..మొదటి దశలో సెప్టెంబర్ చివరికీ 20 బస్సులను నడుపుతామని తిరుమలరావు తెలిపారు.డిసెంబర్ ఆఖరి లోపల తిరుమలతో పాటు తిరుపతి కేంద్రంగా వివిధ ప్రాంతాలకు వంద బస్సులు నడిపే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని..ఒక్క సారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే 250 కిల్లో మీటర్ల మేర బస్సు నడుస్తుందన్నారు. కాలుష్యం తగ్గించి, ఆర్టీసీ లాభసాటిగా వుండేలా సేవలు అందిస్తామన్నారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.
అంతకుముందు పంజాబ్ గవర్నర్ భన్వరీ లాల్ పురోహిత్ తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న గవర్నర్ విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Read Also: RangaRanga Vybhavamga Team At Tirumala: తిరుమల శ్రీవారి సేవలో రంగరంగ వైభవంగా టీం