23 Percent Discount on Realme 12 Pro 5G in Flipkart Goat Sale 2024: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో ప్రస్తుతం ‘గోట్ సేల్’ నడుస్తోంది. జులై 20న మొదలైన ఈ సెల్ 25 వరకు కొనసాగనుంది. గోట్ సేల్ కింద స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, లాప్‌టాప్‌లు, గృహోపకరణాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీగా డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ సేల్‌లో ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఆఫర్స్ ఉన్నాయి. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘రియల్‌మీ’కి చెందిన ‘రియల్‌మీ 12 ప్రో 5జీ’పై నేరుగా 7 వేల తగ్గింపు ఉంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
రియల్‌మీ 12 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ (realme 12 Pro 5G 128 GB, 8 GB RAM) అసలు ధర రూ.29,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ 2024లో ఈ ఫోన్‌పై 23 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. దాంతో మీకు 7 వేల తగ్గింపుతో రూ.22,999కి అందుబాటులో ఉంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 10 శాతం వరకు తగ్గింపు ఉంది. దాంతో మీరు దాదాపుగా రూ.20,999తో రియల్‌మీ 12 ప్రో 5జీని ఇంటికి తీసికెళ్ళిపోవచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ మరో కొన్ని గంటలు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Also Read: Gold Price Today: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. వారం రోజుల్లో ఐదోసారి!
రియల్‌మీ 12 ప్రోలో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేటు, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది. స్నాప్‌డ్రగన్ 6 జనరేషన్ 1 ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0తో పనిచేస్తుంది. 50 ఎంపీ సోనీ ఐఎంక్స్ 882 ప్రధాన కెమెరా, 32 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 709 టెలీఫొటోలెన్స్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సర్ ఉంది. సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరాను ఇచ్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. అది 67W సూపర్ వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.