Gold Rates Today in India and Hyderabad on 23 July 2024: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. అదే రీతిలో తగ్గుతూ వస్తున్నాయి. గత 6 రోజుల్లో ఐదోసారి పసిడి ధరలు తగ్గడం విశేషం. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 తగ్గింది. మంగళవారం (జులై 23) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,450 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,580గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,730గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.67,450 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.73,580గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.68,100గా.. 24 క్యారెట్ల ధర రూ.74,290గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో 22 క్యారెట్ల ధర రూ.67,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,580గా నమోదైంది.
Also Read: Bigg Boss: బెడ్‌రూమ్‌లో శ్రుతిమించి ప్రవర్తిస్తున్నారు.. బిగ్‌బాస్ షోను ఆపండి!
ఈరోజు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.400 తగ్గి.. రూ.91,100గా ఉంది. వెండి ధరల్లో కూడా గత ఆరు రోజులుగా పెరుగుదల లేదు. నేడు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.91,100 కాగా.. ముంబైలో సైతం రూ.91,100గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.95,600లుగా నమోదవగా.. బెంగళూరులో అత్యల్పంగా రూ.91,000గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.95,600లుగా నమోదైంది. కిలో వెండి ధర గత వారంలో లక్ష దాటిన విషయం తెలిసిందే.