Royal Enfield 350: రాయల్ ఎన్ ఫీల్డ్ ఈ పేరులోనే ఏదో వైబ్రేషన్ ఉంటుంది. డుగ్ డుగ్ డుగ్ అంటూ ఇది చేసే సౌండ్ కు ఉండే క్రేజే వేరు. అబ్బాయిలలో చాలా మందికి ఇది డ్రీమ్ బైక్. దీని ధర నార్మల్ బైక్ తో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ దీనిని కొనడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. పేరులో ఉన్నట్లుగానే దీని లుక్ కూడా రాయల్ గా ఉంటుంది. ఇక ఎంతో కాలంగా ఎన్‌ఫీల్డ్ లవర్స్ ఎదురుచూస్తున్న ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350’ బైక్ ఇండియా మార్కెట్లో విడుదలైంది.ఈ మోడల్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. .
Also Read:Health Tips: తాజా అల్లం, శొంఠి రెండింటిలో ఏది ఆరోగ్యానికి బెస్ట్
2023 బుల్లెట్ 350 డిజైన్ పరంగా పాత మోడల్‌నే పోలి ఉంది. అయితే ఫీచర్స్ లో మాత్రం చాలా మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మోడల్స్ ను జే-ప్లాట్ ఫామ్ పై రూపొందించారు. ఇక దీనిలో 349 సీసీ, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 20 బీహెచ్ పీ పవర్ ను, 27 ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక ఇందులో 5 స్పీడ్ గేర్ బాక్స్ కూడా ఉంటుంది. ఇందులో సింగిల్ పీస్ సీట్, సర్క్యులర్ హాలోజెన్ హెడ్ ల్యాంప్ వంటివి ఉన్నాయి. ఫ్యుయెల్ ట్యాంక్ పై బుల్లెట్ 350 అని రాసి ఉంటుంది. సస్పెషన్స్ విషయానికొస్తే.. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్‌లో ట్విన్ గ్యాస్- ఛార్జ్డ్ షాక్ అబ్సార్బర్స్ వంటివి లభిస్తున్నాయి. ఇక ఇది బ్లాక్ గోల్డ్, స్టాండర్డ్ మెరూన్, స్టాండర్ట్ బ్లాక్, మిలటరీ రెడ్, మిలటరీ బ్లాక్ కలర్స్ లో అందుబాటులో ఉంది. దీనిలో మిలిటరీ కలర్ వేరియంట్ ధర రూ. 1.73 లక్షల నుండి ప్రారంభమవుతుంది, స్టాండర్డ్ వెర్షన్‌కి రూ. 1.97 లక్షలు, టాప్-టైర్ బ్లాక్ గోల్డ్ వేరియంట్‌కి రూ.2.16 లక్షలు అవుతుంది.