NTV Telugu Site icon

CP CV Anand : మతపరమైన ర్యాలీల్లో డీజే, టపాసుల వాడకంపై రౌండ్ టేబుల్ సమావేశం

Hyderabad Cp Anand

Hyderabad Cp Anand

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అధ్యక్షతన మతపరమైన ర్యాలీల్లో డీజే, టపాసుల వాడకం పై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హైదరాబాద్, రాచకొండ సీపీ లు హాజరయ్యారు. వీరితో పాటు GHMC కమిషనర్ అమ్రాపాలి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాజసింగ్, MIM ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ప్రతినిధులు, మత సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. డీజే శబ్దాల మీద అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, నివాసాల్లో వయసు మీరిన వారు ఇబ్బంది పడుతున్నారన్నారు.

Emergency Movie: కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ విడుదలకు మార్గం సుగమం.. కొన్ని సీన్స్ కట్

గుండె అదురుతోందని ఆందోళన చెందుతున్నారని, డీజే సౌండ్స్ ఈసారి శృతి మించాయన్నారు సీపీ సీవీ ఆనంద్‌. గణేష్ పండుగే కాదు.. మిలాద్ ఉన్ నబి లో డీజే నృత్యాలు విపరీతం అయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. పబ్బుల్లో నృత్యాలు చేసినట్లే ర్యాలీల్లో చేస్తున్నారని, మాకు అనేక సంఘాలు వినతులు ఇచ్చారన్నారు. డీజే శబ్దాలు కట్టడి చేయాలని కోరారని, అందుకే పలు వర్గాలను పిలిచామని ఆయన వెల్లడించారు. అందరి అభిప్రాయం తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని, మా నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. డీజే శబ్దాల పై కంట్రోల్ లేకపోతే ఆరోగ్యాలు దెబ్బ తింటాయని, శబ్ద కాలుష్యంతో పర్యావరణానికి కూడా హానికరమన్నారు సీపీ సీవీ ఆనంద్‌.

IND vs BAN: బుమ్రా ఔట్.. అక్షర్ డౌటే! బంగ్లాతో రెండో టెస్టులో ఆడే భారత తుది జట్టు ఇదే