India Captain Rohit Sharma React on Big Against Australia: చేజింగ్‌లో భారత్ ఇన్నింగ్స్ ఆరంభం చూసి తాను భయపడ్డానని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈ గెలుపు క్రెడిట్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌దే అని పేర్కొన్నాడు. బౌలింగ్, ఫీల్డింగ్‌లో టాప్ క్లాస్ పెర్ఫామెన్స్ ఇచ్చినందుకు సంతోషంగా ఉందని రోహిత్ చెప్పాడు. చెన్నై అభిమానులు తమని ఎప్పుడూ నిరాశపరచరు అని భారత కెప్టెన్ అన్నాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో వన్డే ప్రపంచకప్ 2023లో రోహిత్ సేన శుభారంభం చేసింది.
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘చాలా సంతోషంగా ఉంది. ఈ విజయం మంచి అనుభూతిని ఇచ్చింది. టోర్నీని గెలుపుతో ప్రారంభించడం ఆనందంగా ఉంది. బౌలింగ్, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన చేశాం. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో టాప్ క్లాస్ పెర్ఫామెన్స్ ఇచ్చాం. కఠిన పిచ్‌పై ఆసీస్ బ్యాటర్లు పరుగులు చేయకుండా కట్టడి చేశాం. ఈ వికెట్ స్పిన్నర్లతో పాటు పేసర్లకు అనుకూలంగా ఉంది. సీమర్స్ కూడా రివర్స్ స్వింగ్ రాబట్టారు. మా బౌలర్లు పరిస్థితులను అర్ధం చేసుకుని బంతులు వేశారు. మొత్తంగా సమష్టి ప్రదర్శన కనబర్చారు’ అని అన్నాడు.
Also Read: VVirat Kohli Catch: మిచెల్ మార్ష్ ఆ క్యాచ్ పట్టుంటే.. మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదే!
‘బ్యాటింగ్‌లో మేం ఆశించిన ఆరంభాన్ని అందుకోలేకపోయాం. ఇన్నింగ్స్‌ని ఆరంబించిన విధానం బాగాలేదు. 3 వికెట్లు కోల్పోవడం భయపడ్డా. చేజింగ్‌లో ఇలాంటి ఆరంభాలు అస్సలు బాగోవు. ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మంచి ఏరియాలలో బంతులు సందించారు. అయితే మేం కూడా చెత్త షాట్లు ఆడాం. పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేయాలని వికెట్స్ సమర్పించుకున్నాం. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అసాధారణ భాగస్వామ్యంతో జట్టు విజయానికి బాటలు వేసారు. ఇక తదుపరి వేదికపై ఆడటం మాకు సవాల్‌తో కూడుకున్నది. దేశవ్యాప్తంగా వివిధ వేదికల్లో భిన్నమైన పరిస్థితుల్లో ఆడాల్సి ఉంది. అందుకే టీమ్ కాంబినేషన్ మారొచ్చు. ఇక చెన్నై అభిమానులు ఎప్పుడూ క్రికెట్‌ను ప్రేమిస్తారు. తీవ్ర ఉక్కపోతలో కూడా మ్యాచ్‌కు హాజరై అండగా నిలిచారు’ అని రోహిత్ తెలిపాడు.