Virat Kohli Catch: మిచెల్ మార్ష్ ఆ క్యాచ్ పట్టుంటే.. మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli`s Catch Dropped By Mitchell Marsh: ‘ఓ క్యాచ్.. మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తుంది’ అని క్రికెట్‌లో ఓ సామెత ఉంది. అది మరోసారి రుజువైంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 టైటిల్ ఫెవరేట్ అయిన ఆస్ట్రేలియా జట్టుకు క్యాచ్ మిస్ చేస్తే.. ఫలితం ఎలా ఉంటుందో తెలుసొచ్చింది. ఛేజింగ్ కింగ్ ‘విరాట్ కోహ్లీ’ పొరపాటున ఇచ్చిన క్యాచ్‌ను ఆసీస్ ఫీల్డర్ మిచెల్ మార్ష్ నేలపాలు చేశాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కోహ్లీ.. అద్భుత హాఫ్ సెంచరీతో భారత్‌కు ఊహించని విజయాన్ని అందించాడు.
ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 199 పరుగులకు భారత్ ఆలౌట్ చేసింది. లక్ష్యం చిన్నదే కావడంతో భారత్ సునాయాసంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఆసీస్ పేసర్ల ధాటికి.. టేందినియా టాప్ ఆర్డర్ కుదేలైంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ డకౌట్ అయ్యారు. ఏ పరుగులకే మూడు వికెట్స్ కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక ఆశలన్నీ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌ల మీదే ఉన్నాయి. ఇంకో వికెట్ పడితే మ్యాచ్ మీద ఆశలు పూర్తిగా పోయినట్లే.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
అలాంటి స్థితిలో పరుగులు షాట్లు ఆడలేక సహనం కోల్పోయిన విరాట్ కోహ్లీ ఓ షాట్ ఆడాడు. 8వ ఓవర్ వేసిన జోష్ హేజిల్‌వుడ్ బంతిని కోహ్లీ పుల్ చేయబోయాడు. బంతి గాల్లోకి లేచింది. దాంతో స్టేడియంలో ఉన్న వేలాది మంది, టీవీల ముందున్న కోట్లాది మందికి ఒక్క క్షణం ఊపిరి ఆగినట్లయింది. మిచెల్ మార్ష్ షార్ట్ మిడ్ వికెట్ నుంచి పరిగెత్తుకొచ్చి.. బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే బంతిని అంచనా వేయడంలో విఫలమైన మార్ష్ క్యాచ్‌ను పట్టలేకపోయాడు. అంతే అందరికీ ఊపిరి తిరిగొచ్చినట్లయింది. కోహ్లీ కూడా బతికిపోయాను అనుకున్నాడు.
మిచెల్ మార్ష్ క్యాచ్ జారవిడిచిన సమయానికి విరాట్ కోహ్లీ వ్యక్తిగత స్కోరు 12 పరుగులే. ఆ తర్వాత కోహ్లీ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తనదైన శైలిలో క్రీజ్‌లో పాతుకుపోయి ఏకంగా 85 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ క్రీజ్‌లో కుదురుకోవడంతో భారత్ లక్ష్యం దిశగా వెళ్లింది. విరాట్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ.. గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. తన అనుభవాన్ని ఉపయోగించి టీమిండియాకు మరో మరుపురాని విజయాన్ని అందించాడు. ఒకవేళ మార్ష్ ఆ క్యాచ్ అందుకుని ఉంటే.. మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదే. అది ఊహించడానికే భయంకరంగా ఉంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?