Rohit Sharma Shows His Biceps to Umpire: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శనివారం అహ్మదాబాద్‌లోని ఐకానిక్ నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. భారీ సిక్స్‌లు, బౌండరీలు బాదుతూ పాకిస్థాన్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఈ క్రమంలో 63 బంతుల్లో 6 సిక్స్‌లు, 6 ఫోర్లు బాది 86 రన్స్ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్‌కు భారత కెప్టెన్ తన కండలు చూపించాడు.
పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ షా అఫ్రిది బౌలింగ్‌లో రోహిత్ శర్మ భారీ సిక్సర్ బాదాడు. అది ఏకంగా 92 మీటర్ల దూరం వెళ్లింది. అప్పటికే హిట్‌మ్యాన్ 2-3 సిక్స్‌లు సునాయాసంగా బాదేశాడు. అలవోకగా సిక్స్‌లు బాదడం చూసి ఆశ్చరపోయిన ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్.. ఎలా అంత ఈజీగా కొడుతున్నావని హిట్‌మ్యాన్‌ను ప్రశ్నించగా.. తన కండలు (బైసెప్స్) చూపించాడు. తన కండ బలంతోనే సిక్స్‌లు బాదుతున్నానని రోహిత్ సరదాగా చూపించాడు. రోహిత్ తన బైసెప్స్ అంపైర్ ఎరాస్మస్‌కు చూపిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read: Anushka Sharm-Virat Kohli: మైదానం నుంచే అనుష్కకు కోహ్లీ సీక్రెట్ మెసేజ్.. వీడియో వైరల్!
షాహిన్ షా అఫ్రిది బౌలింగ్‌లోనే రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. అఫ్రిది స్లో బాల్ వేయగా.. రోహిత్ భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. దాంతో 14 పరుగులతో సెంచరీని మిస్ అయ్యాడు. ఆస్ట్రేలియాపై డకౌట్ అయిన హిట్‌మ్యాన్.. అఫ్గానిస్తాన్‌పై సెంచరీ బాదిన విషయం తెలిసిందే. అఫ్గాన్ పైన 5 సిక్స్‌లు బాదిన రోహిత్.. పాకిస్తాన్‌పై 6 సిక్స్‌లు కొట్టాడు. రోహిత్ సిక్స్‌లను సునాయాసంగా కొడతాడని మనకు తెలిసిందే. మైదానం నలు వైపులా భారీ సిక్స్‌లు బాదుతుంటాడు. కెరీర్ ఆరంభం నుంచి కూడా ఫార్మాట్ ఏదైనా.. సిక్స్‌లు బాదుతాడు. రోహిత్ సిక్స్‌లను సునాయాసంగా కొట్టడానికి కారణం అద్భుతమైన అతడి టైమింగ్. ఇతర బ్యాటర్లతో పోలిస్తే.. బంతిని ముందుగానే అంచనా వేసి షాట్ ఆడుతుంటాడు.
Rohit Sharma showing his biceps muscles to umpires after hitting Six.
– A beautiful moment. pic.twitter.com/UJqPkHHr1j
— CricketMAN2 (@ImTanujSingh) October 14, 2023