Rohit Sharma: అందరి తండ్రుల మాదిరిగానే రోహిత్!
- నవంబర్ 22న పెర్త్ వేదికగా తొలి టెస్ట్, ఆస్ట్రేలియాకు వెళ్లని రోహిత్, ముంబైలో ప్రాక్టీస్ చేస్తున్న హిట్‌మ్యాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 కోసం భారత జట్టు ఇప్పటికే కంగారో గడ్డకు చేరుకుంది. టీమిండియా ప్లేయర్స్ సాధన కూడా మొదలెట్టేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఆస్ట్రేలియాకు వెళ్లలేదు. రోహిత్ సతీమణి రితిక రెండో కాన్పు నేపథ్యంలో భారత్‌లోనే ఉండాలని అతడు నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. రోహిత్ ఆసీస్ వెళ్లేదెప్పుడో ఇప్పటికీ క్లారిటీ లేదు. అయినా కూడా హిట్‌మ్యాన్ తన బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను ఆపలేదు. రోహిత్ ముంబైలో బ్యాటింగ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
‘రోహిత్ శర్మ ఆస్ట్రేలియా ప్రయాణంకు సంబంధించి ఇప్పటివరకు ఏ సమాచారం లేదు. వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో అందరు తండ్రుల మాదిరిగానే.. హిట్‌మ్యాన్ చేస్తున్నాడు. భార్య, కుటుంబంతో కలిసి ఉన్నాడు. కుటుంబంతో ఉన్నానని టెస్టు సిరీస్ కోసం ప్రాక్టీస్ చేయడంలో ఏ నిర్లక్ష్యం చూపించడం లేదు. సమయం దొరికినప్పుడల్లా ముంబైలో ప్రాక్టీస్ చేస్తున్నాడు’ అని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ప్రాక్టీస్ పోటోలను రోహిత్ పీఆర్ టీమ్ పోస్ట్ చేయగా.. తొలి టెస్టుకు అందుబాటులో ఉండేందుకే హిట్‌మ్యాన్ ప్రయత్నిస్తున్నాడని అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
Also Read: 5 Star Rating Cars: మహీంద్రా మూడు వాహనాలకు 5 స్టార్ రేటింగ్.. అవేంటో తెలుసా?
నవంబర్ 22న పెర్త్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఒకవేళ రోహిత్ శర్మ పెర్త్ టెస్టుకు అందుబాటులో లేకుంటే.. అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా సారథిగా వ్యవహరిస్తాడు. ఈవిషయంపై ఇప్పటికే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టత ఇచ్చాడు. హిట్‌మ్యాన్ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్‌తో కలిసి అభిమన్యు ఈశ్వరన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ కూడా ఓపెనింగ్ చేసే అవకాశాలు లేకపోలేదు. చూడాలి మరి ఎవరు ఆడతారో.
తాజావార్తలు
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!