IPL 2025: ముంబైలోకి భారీ హిట్టర్.. రోహిత్ ప్లానేనా..?
- ముంబైలోకి భారీ హిట్టర్
- విల్ జాక్స్ స్థానంలో భారీ హిట్టర్ ని బరిలోకి దించేందుకు రోహిత్ మాస్టర్ స్కెచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ రీషెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. ఫారిన్ ప్లేయర్స్ ఆల్మోస్ట్ అందుబాటులోకి వచ్చారు. ముంబై ఆటగాడు విల్ జాక్స్ లీగ్ మ్యాచులకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. ఇంగ్లాండ్ జట్టు వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ఆడనున్న నేపథ్యంలో జాక్స్ ప్లేఆప్స్ కి ముందే ఇంగ్లాండ్ వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్, బీసీసీఐ సడలించిన ఐపీఎల్ రిప్లేసెమెంట్ నిబంధనలను సరిగ్గా వాడుకుంది. విల్ జాక్స్ స్థానంలో భారీ హిట్టర్ ని బరిలోకి దించేందుకు రోహిత్ మాస్టర్ స్కెచ్ వేశాడు.
Also Read:Jammu Kashmir: పాక్‌ని పట్టించుకునేదే లేదు.. రెండు ప్రాజెక్టుల పనుల వేగం పెంచండి..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
దానికి కెప్టెన్ హార్దిక్ కూడా ఒకే చెప్పాడు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం 12 మ్యాచులకు ముందు ఒక ఆటగాడిని రీప్లేస్ చేసుకోవాలి. అయితే తాజాగా బీసీసీఐ రీప్లేస్మెంట్ నిబంధనలను సడలించడంతో ముంబైకి కలిసొచ్చింది. ముంబై ఇప్పటికే 12 మ్యాచులు ఆడేసింది. సో .. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తే విల్ జాక్స్ స్థానంలో జానీ బెయిర్‌స్టో తాత్కాలికంగా ముంబై ఇండియన్స్‌లో చేరతాడు. ఇప్పటికే ముంబై జానీ బెయిర్‌స్టో చర్చలు జరిపింది. అయితే జానీ బెయిర్‌స్టో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నుంచి NOC పొందితేనే అతను ప్లేఆఫ్ మ్యాచ్‌ల కోసం ముంబై ఇండియన్స్‌లో చేరడానికి వీలుంటుంది.
Also Read:Airtel: ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఉచితంగా ఫ్రాడ్ డిటెక్షన్ సదుపాయం..
2025 మెగా వేలంలో జానీ బెయిర్‌స్టో అమ్ముడుపోలేదు. పైగా 2024 జూన్ నుంచి ఇంగ్లాండ్ తరపున ఏ ఫార్మాట్‌లోనూ ఆడలేదు. ఈ పరిస్థితిలో ఈ ఐపీఎల్ అతనికి ఆర్ధికంగానూ ఉపయోగపడనుంది. జానీ బెయిర్‌స్టో ఇప్పటివరకు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. టోర్నీలో మొత్తం 50 మ్యాచ్‌లు ఆడాడు. 144.45 స్ట్రైక్ రేట్‌తో 1589 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు కూడా ఉన్నాయి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!