మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో జరిగిన పేలుడులో 5 మంది మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
జర్మనీని భారీ వరదలు ముంచెత్తాయి. దక్షిణ జర్మనీలోని బవేరియాలో ఈ వరదలు ముంచెత్తాయి. ఈ వరదలు కారణంగా ఇప్పటివరకు ఐదుగురు చనిపోయారు. అలాగే కార్లు కొట్టుకుపోయాయి. నివాస ప్రాంతాలు జలమయ్యాయి.
పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలోని రాష్ట్ర రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలు వాహనాలను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు మరణించగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పురూలియా ఎస్పీ అవిజిత్ బెనర్జీ తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు నిర్మాణం కోసం కాంక్రీట్‌ను తీసుకెళ్తున్న ట్రక్కు మొదట ఓ బైక్ను ఢీకొట్టగా.. బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారన్నారు.