Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వైద్యుడు, అతని కూతురు మృతిచెందారు.. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తిరుపతికి చెందిన వైద్యుడు కిషోర్ కుటుంబ సభ్యులతో కలిసి కారులో గుంటూరు బయల్దేరి వెళ్తుండగా.. తెల్లవారుజామున చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది.. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిది.. ఈ ఘటనలో కారు డ్రైవ్ చేస్తున్న కిషోర్ అక్కడిక్కడే మృతిచెందగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా కిషోర్ కూతురు మృతి చెందింది. కారులో ఉన్న ముగ్గురు కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స కోసం గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్