Akkineni Nagarjuna: నన్నెవ్వరు నమ్మలేదు.. చివరికి అమల కూడా.. పిచ్చి పట్టిందా అన్నట్లు.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ఆషికా రంగనాథ్ జంటగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నా సామి రంగా. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నాగార్జున, నరేష్, రాజ్ తరుణ్ కాంబో అదిరిపోయింది. పర్ఫెక్ట్ కుటుంబ కథా చిత్రంగా సంక్రాంతికి రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించింది. చాలా గ్యాప్ తరువాత నాగ్ మంచి విజయాన్ని అందుకున్నాడు. అసలు ఈ సినిమా సంక్రాంతి రేస్ లోకి వస్తుందని ఎవరు అనుకోలేదు. గతేడాది సెప్టెంబర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. కేవలం మూడు నెలలో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని బరిలో దిగడమంటే మాటలు కాదు. సంక్రాంతి- నాగార్జున బెస్ట్ కాంబినేషన్. ఇక ఈ సినిమాకు కీరవాణీ స్టార్ అని నాగ్ నే చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా సక్సెస్ ను అందుకోవడంతో తాజాగా నా సామీ రంగా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.
ఈ సక్సెస్ మీట్ లో నాగార్జున మాట్లాడుతూ..ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పాడు. ముఖ్యంగా సంక్రాంతి రేసులో తన సినిమాను ఉండనిచ్చినందుకు ఫిల్మ్ కౌన్సిల్ కు థాంక్స్ చెప్పాడు. ఇక సినిమాను ఇంతగా ఆదరించిందినందుకు అభిమానులకు థాంక్స్ చెప్పాడు. సెప్టెంబర్ లో ఈ సినిమాను మొదలుపెట్టామని, సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని చెప్తే ఎవ్వరు తనను నమ్మలేదని, చివరికి నా కొడుకులు, అమల కూడా నమ్మలేదని తెలిపాడు. అంతేకాకుండా బయట ఎక్కడ అయినా చెప్తే.. పిచ్చి పట్టిందా.. ? ఏంటి అన్నట్లు చూసేవారని, కేవలం తన టీమ్ మాత్రమే తనను నమ్మిందని అన్నాడు. ఇక చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. కీరవాణీ వలనే ఈ సినిమా సాధ్యమైందని, ఆయన టైమ్ టేబుల్ ఇచ్చి తమ బృందాన్ని ముందుకు తోశారని చెప్పుకొచ్చాడు. ఇక చివర్లో వచ్చే సంక్రాంతికి కలుద్దాం అని చెప్పడంతో.. నాగ్ హింట్ ఇచ్చేశాడని, కొత్త సినిమాతో రాబోతున్నాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!