యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫ్యాన్స్ కు కావాల్సినంత జోష్ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ ను టెంపర్ కు ముందు టెంపర్ తర్వాత అని సెపరేట్ చేసి చూడాలి. టెంపర్ నుండి వరుసగా హిట్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లో ఫ్యాన్స్ కలర్ ఎగరేసుకునే సినిమాలు చేస్తాను అని చెప్పిన ఎన్టీఆర్ అయన అభిమానులను కాలర్ ను ఎగరేపిస్తూనే ఉన్నాడు.
Also Read : Jr. NTR : వార్ 2 ఈవెంట్ సూపర్ సక్సెస్.. కానీ ఎన్టీఆర్ క్షమాపణలు
తాజాగా జరిగిన వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మరోసారి కాలర్ ఎగరేశాడు. అయితే ఈ సారి ఒకటి కాదు ఏకంగా రెండు కాలర్స్ ఎగరేసాడు. అంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించుకోవచ్చు. నిన్న, మొన్నటివరకు వార్ 2 కు బజ్ లేదన్నారు. ప్రమోషన్స్ కూడా సరిగా చేయడం లేదని అభిమానులు ఫీల్ అయ్యరు. కానీ ఎన్టీఆర్ చేసిన ఒకే ఒక స్పీచ్ తో ఈ సినిమాపై ఉన్ననెగిటివి మొత్తాన్నీ మార్చేశాడు ఎన్టీఆర్. ఈసారి రెండు కాలర్లూ ఎగరేసి మరీ ‘బొమ్మ అదిరిపోయింది’ అని చెప్పాడు. అంటే ఈ సినిమాపై ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ అంటే ఏమిటో అర్ధం చేసుకోండి. సూపర్ హిట్ కొడుతున్నాం అని చెప్పాడంటే.. ఈ సినిమాపై తనకెంత నమ్మకమో. ఇప్పటి వరకూ ‘వార్ 2’కి సంబంధించి ఒక్క ఈవెంట్ కూడా జరగలేదు. ట్రైలర్ కానీ టీజర్ గాని సినిమాపై బజ్ ను తీసుకురాలేదు. కానీ వార్ 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగాక అందులో ఎన్టీఆర్ స్పీచ్ చూశాక ఈ ఒక్కటి చాలు. ఎన్టీఆర్ చెప్పాడంటే అది జరిగి తీరుతుందని ఫ్యాన్స్ కూడా రెండు కాలర్స్ ఎగరేస్తున్నారు.