Srisailam: శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు.. నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
- శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు
- జూరాల నుంచి భారీగా వస్తున్న ప్రవాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam: ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గతవారం రోజులుగా కురుస్తోన్న వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణ్‌పూర్ జలాశయాలు నిండిపోయాయి. దీంతో నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి జలాశయానికి వచ్చిన నీటి వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయానికి 66 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. జూరాల వైపు 46 వేల క్యూసెక్కుల ప్రవాహం విడుదల చేస్తున్నారు. జూరాలకు ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని ఆ నీటిని దిగువకు విడుదల చేస్తన్నారు. జూరాల నుంచి శ్రీశైలం దిశగా వరద సాగుతోంది. జూరాల సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7 టీఎంసీలు ఉంది. ఎగువ నుంచి ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో జూరాల నుంచి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల జలాశయం నుంచి వరద నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది.
Read Also: Home Minister Anitha: కాలినడకన తిరుమల చేరుకున్న హోంమంత్రి అనిత
Also Read
- CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. అభిజిత్ దీప్కే అరెస్ట్..!
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Penukonda Tragedy: దసరా సెలవుల్లో విషాదం.. గొల్లపల్లి రిజర్వాయర్‌లో ఐదుగురు మృతి
- KitKat Chocolate Worms : కిట్ క్యాట్‌లో పురుగులు.. కూకట్పల్లి లులు మాల్లో షాకింగ్ ఘటన
శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 29,420 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతుండగా.. ఔట్‌ఫ్లో నిల్‌గా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 807.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 33.1089 టీఎంసీలుగా ఉంది. రాబోయే రెండు రోజుల్లో శ్రీశైలం జలాశయంలో భారీ స్థాయిలో నీటి నిల్వ పెరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. అభిజిత్ దీప్కే అరెస్ట్..!
-
Kavitha : రైతులను త్యాగం చేయమంటారా? రేవంత్‌పై కవిత ఫైర్.!
-
Nagarjuna: ‘చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?’.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
-
Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
-
Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!