Rishabh Pant: తన బ్యాట్ గ్లోవ్స్, హెల్మెట్‌కి మొక్కిన రిషబ్ పంత్.. ఫలించిన పూజలు
- టెస్టు కెరీర్లో ఆరో సెంచరీ చేసిన రిషబ్ పంత్
- క్రీజులోకి దిగే ముందు ఆయుధ పూజ చేసిన పంత్
- తన బ్యాట్.. గ్లౌజులను టేబుల్ పై ఉంచి చేతులు జోడించి మొక్కిన పంత్
- వీడియో సోషల్ మీడియాలో వైరల్.
చాలా కాలం తర్వాత టీమిండియా తరుపున టెస్టు మ్యాచ్ ఆడిన రిషబ్ పంత్.. సెంచరీతో అదరగొట్టాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుత సెంచరీ సాధించాడు. 2022 డిసెంబర్లో జరిగిన ఘోర ప్రమాదంతో చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో దుమ్ము రేపాడు. దీంతో.. సెంచరీ చేశాడు. అతని టెస్టు కెరీర్లో ఇది ఆరో సెంచరీ. అయితే.. తొలి టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు ఆట ప్రారంభానికి ముందు ఆయుధ పూజ చేశాడు. తన బ్యాట్, గ్లౌజులను టేబుల్ పై ఉంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా మొక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ సెంచరీతో చెలరేగడం గమనార్హం. దీంతో.. పంత్ పూజలు ఫలించాయని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తర్వాత పంత్.. ఆకాశం వైపు చూసి కళ్లు మూసుకుని మరోసారి దేవుడిని ప్రార్థించాడు. అనంతరం తనదైన శైలిలో హెల్మెట్ తీసి.. అభిమానులకు బ్యాట్‌తో అభివాదం చేశాడు.
Read Also: Lucknow: ఎంతకు తెగించాడంటే.. డబ్బుల కోసం కొడుకు ఏం చేశాడంటే..?
Also Read
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
- Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
- M. K. Stalin: "కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది".. ఎగ్జిట్ పోల్స్‌పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- Babar Azam: టీ20 క్రికెట్లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్‌ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
మొదటి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్.. కేవలం 39 పరుగులు మాత్రమే చేయగా.. రెండవ ఇన్నింగ్స్ లో 109 పరుగులు సాధించాడు. దీంతో.. బంగ్లాదేశ్ ముందు టీమిండియా భారీ టార్గెట్ ను సెట్ చేసింది. కాగా.. రెండవ ఇన్నింగ్స్‌లో 287 పరుగుల వద్ద టీమిండియా డిక్లేర్ చేసింది. దీంతో తొలి, రెండో ఇన్నింగ్స్ లలో కలిపి 515 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందు ఉంచింది. కాగా.. లక్ష్య ఛేదనలో బంగ్లా 234 పరుగులకు కుప్పకూలడంతో భారత్ 280 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Read Also: MP Awadhesh Prasad: అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడిపై కిడ్నాప్, దాడి కేసు..
తాజావార్తలు
-
Weather Updates in Regional Languages: రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
-
NTRNEEL : డ్రాగన్ పార్ట్ – 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్
-
Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
-
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్‌మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
-
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్‌పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!