Richest Family: ప్రపంచ సంపద పెరుగుతోంది. ప్రతి రోజు మనం ఎవరో ఒకరి పురోగతి కథను వార్తల ద్వారా వింటూనే ఉన్నాము. ప్రపంచంలోని అత్యంత ధనిక కుటుంబం ఎవరిదో తెలుసా ? వారికి అపారమైన సంపద ఉంది. ఈ కుటుంబానికి దాదాపు రూ. 4000 కోట్ల విలువైన ప్యాలెస్, 700 కార్లు, 8 ప్రైవేట్ జెట్ విమానాలు ఉన్నాయి. ఇది కాకుండా, ఈ కుటుంబం ప్రపంచంలోని మొత్తం ముడి చమురు నిల్వలలో 6 శాతం కలిగి ఉంది. అంతేకాకుండా, మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ వీరిదే. ఇది కాకుండా, వారు ప్రసిద్ధ గాయని రిహన్న బ్యూటీ బ్రాండ్ ఫెంటీ, ఎలోన్ మస్క్ స్పేస్ Xతో పార్టనర్ షిప్ కలిగి ఉన్నారు. ఆయనే UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. తన ఆస్తులు గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. దుబాయ్ రాజకుటుంబం గురించి ఎన్నో ఆశ్చర్యపోయే విషయాలు ఉన్నాయి.
దుబాయ్‌కి చెందిన అల్ నహ్యాన్ కుటుంబం ఇల్లు అమెరికాలోని పెంటగాన్స్ కంటే మూడు రెట్లు పెద్దది. దీని విలువ రూ.4078 కోట్లుగా అంచనా వేశారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ కుటుంబానికి అధిపతి. అతనికి 18 మంది సోదరులు, 11 మంది సోదరీమణులు ఉన్నారు. వీరికి 9 మంది పిల్లలు. అబుదాబి పాలకుడి తమ్ముడు షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ దగ్గర దాదాపు 700 కార్లు ఉన్నాయి. వీటిలో బుగట్టి వేరాన్, లంబోర్ఘిని రావోంటో, మెర్సిడెస్-బెంజ్ సెల్కే GTR, ఫెరారీ 599XX, మెక్‌లారెన్ MC12 కూడా ఉన్నాయి.
Read Also:Reliance Profit: మూడు నెలల్లో రూ.19 వేల కోట్లకు పైగా లాభం సాధించిన రిలయన్స్ సంస్థ
ఈ కుటుంబం అబుదాబిలోని అల్ వతన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో నివసిస్తోంది. అతనికి UAEలో అనేక రాజభవనాలు ఉన్నాయి. అల్ వతన్ దాదాపు 94 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువులను ఈ ఇంట్లో అమర్చారు. అధ్యక్షుడి సోదరుడు తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కుటుంబ పెట్టుబడి కంపెనీని నడుపుతున్నాడు. గత 5 ఏళ్లలో దీని విలువ సుమారు 28 వేల శాతం పెరిగింది. దీని విలువ దాదాపు 235 బిలియన్ డాలర్లు. కంపెనీ వ్యవసాయం, ఇంధనం, వినోదం, సముద్ర రవాణా వంటి అనేక వ్యాపారాలను కలిగి ఉంది. వీటిలో వేలాది మందికి ఉపాధి లభించింది.
దుబాయ్‌కి చెందిన ఈ ప్రసిద్ధ కుటుంబానికి పారిస్, లండన్‌లలో కూడా విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. ఈ కుటుంబానికి చెందిన మాజీ పెద్దను ‘లండన్ భూస్వామి’ అని కూడా పిలుస్తారు. అతను బ్రిటన్‌లోని నాగరిక ప్రాంతాలలో చాలా ఆస్తులను కలిగి ఉన్నాడు. 2015లో న్యూయార్కర్ నివేదిక ప్రకారం, దుబాయ్ రాజకుటుంబం బ్రిటన్ రాజకుటుంబంతో సమానమైన సంపదను కలిగి ఉంది. అతను 2008లో మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ జట్టును సుమారు రూ. 2122 కోట్లకు కొనుగోలు చేశాడు. సిటీ ఫుట్‌బాల్ గ్రూప్‌లో అతనికి 81 శాతం వాటా ఉంది. ఈ బృందం ముంబై సిటీ, మెల్‌బోర్న్ సిటీ, న్యూయార్క్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌లను కూడా నిర్వహిస్తోంది.
في كلّ ركنٍ قصة من وحي تاريخ دولة الإمارات العربية المتحدة!
اكتشفوا قصص تراث الأمة الغني والعظيم وخططوا لزيارتكم إلى #قصر_الوطن اليوم. #في_أبوظبي pic.twitter.com/Uv4zQH6bXb— Qasr Al Watan (@QasrAlWatanTour) November 1, 2022
Read Also:Third World War: దేశాల మధ్య వరుస దాడులు.. మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం ఉందా..?