ఆర్జీవీ పై ఒంగోలు పోలీసులు సీరియస్ యాక్షన్ కు సిద్ధమయ్యారు. వర్మను అరెస్టు చేసి ఒంగోలు తీసుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. డిజిటల్ మోడ్ లో విచారణకు హాజరవుతానని ఆర్జీవీ రెక్వెస్ట్ చేసినా అవకాశం ఇచ్చేది లేదంటున్నారు. విచారణ అధికారిగా పోలీసులకు ఉన్న పవర్స్ దృష్ట్యా డిజిటల్ విచారణకు అంగీకరించమంటున్నారు. ఆయన కోరిన విధంగా రెండు సార్లు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించినా ఆర్జీవీ సద్వినియోగం చేసుకోలేదంటున్నారు. పోలీసు అధికారుల నోటీసులు ధిక్కరించారు కాబట్టే చట్టప్రకారం ఆర్జీవీ ని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
Kissik Song: పుష్ప -2 కిస్సిక్ సాంగ్..కసక్ అనిపించిందా?
ఇప్పటికే హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద మోహరించారు. ఆర్జీవీ మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ లో ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. ఆర్జీవీ ని ట్రాక్ చేసేందుకు తెలంగాణ పోలీసుల సాయం కోరనున్నారు జిల్లా పోలీసులు. అయితే ఈ విషయం మీద రామ్ గోపాల్ వర్మ లాయర్ స్పందించారు. దేశం ఇంత అభివృద్ధి చెంది ముందుకు దూసుకుపోతున్న కారణంగా ఫిజికల్ గా కాకుండా వర్చువల్ గా హాజరవుతామని చెబుతున్నారు. అంతేకాక ఆయన బిజీ డైరెక్టర్ కావడంతో ఆ సదుపాయం కోసం కోరినట్టు చెబుతున్నారు. అయితే థర్డ్ డిగ్రీకి వర్మ భయపడ్డారా? అని అడిగిన మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా థర్డ్ డిగ్రీకి వర్మ భయపడడు అని వర్మ తరపు లాయర్ చెప్పుకొచ్చారు.