Revanth Reddy: నేను ఇక్కడికి వస్తున్నానని కేసీఆర్ కొడంగల్ పోయిండు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రెండుసార్లు కేసీఆర్ ను ఎమ్మెల్యేను చేస్తే… మల్లన్న సాగర్ లో మిమ్మల్ని నిండా ముంచాడని ఆరోపించారు. కొండపోచమ్మలో మిమ్మల్ని తోసిండు, రంగనాయక్ సాగర్ లో ముంచిండని విమర్శించారు. ముంపు బాధితుల పక్షాన ఆనాడు ఏటిగడ్డ కిష్టాపూర్ లో తాను దీక్ష చేశానని తెలిపారు.
Read Also: IND vs AUS T20: విశాఖ వేదికగా తొలి టీ20.. భారత్-ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!
Also Read
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
- Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
- Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
కేసీఆర్ ను మీరు పాతాళానికి తొక్కాలనుకుంటే.. కామారెడ్డికి పారిపోయిండని రేవంత్ రెడ్డి విమర్శించారు. కామారెడ్డికే కాదు.. కన్యాకుమారికి పారిపోయిన ప్రజలు కేసీఆర్ ను ఓడించి తీరతారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లుండే.. ఇయ్యాల ఎర్రవల్లిలో ఎట్లుండు అని ప్రశ్నించారు. రైతుల మేలుకంటే కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకుపోయేందుకే ప్రాధాన్యతనిచ్చిండని తెలిపారు. రైతుల వడ్లు కొనని కేసీఆర్… ఆయన ఫామ్ హౌస్ లో పండిన వడ్లను కావేరి సీడ్స్ కు క్వింటా రూ.4500లకు అమ్ముకుండని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Read Also: Bandi Sanjay: కేటీఆర్, కేసీఆర్‌లపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు
కేసీఆర్ ను గజ్వేల్ లో ఓడించాలి.. పొలిమేరలకు తరమాలని ఈ సందర్భంగా అక్కడి జనాలనుద్దేశించి మాట్లాడారు. ఆయన ఓడిపోతే ఫామ్ హౌస్ లో పడుకొనివ్వం.. ముమ్మాటికీ దోచుకున్న సొమ్మును కక్కిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బక్కోడు కాదు… లక్షకోట్లు మింగి, పదివేల ఎకరాలు దోచుకున్న బకాసురుడు అని విమర్శించారు. తాను ఇక్కడికి వస్తున్నానని కేసీఆర్ కొడంగల్ పోయిండని అన్నారు. నా నోరు తెరిస్తే కంపు అని కొడంగల్ లో కేసీఆర్ అంటుండు.. ఇద్దరం పోదాం… డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసుకుందామని తెలిపారు. ఎవరి నోట్లో కంపు ఉందో తేలుద్దాం… పొద్దున లేస్తే ఎత్తుడు పోసుడే నీ పని.. నీతో నాకు పోలికా? అని కేసీఆర్ పై మండిపడ్డారు.
తాజావార్తలు
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
-
Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
-
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
ట్రెండింగ్
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..