Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vangaveeti Radhakrishna to Join Jana Sena: విజయవాడ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుందా?.. దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరబోతున్నారా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొంతకాలంగా రాజకీయాల్లో పెద్దగా చురుగ్గా కనిపించని రాధాకృష్ణ జనసేనలో చేరతారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. అంతేకాకుండా ఆయన తన భార్యతో కలిసి జనసేనలో చేరనున్నారని తెలుస్తోంది.
వంగవీటి రాధాకృష్ణ ఇటీవల సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కూడా కలిశారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌తో జరిగిన భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జనసేనలో చేరితే తగిన గుర్తింపు, ప్రాధాన్యం కల్పిస్తామనే భరోసా లభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాధాకృష్ణ పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జనసేనలో చేరుతున్నట్లు పటమటలో బ్యానర్లు వెలిశాయి. శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన నాయకులు బ్యానర్లు కట్టారు. అయితే రాధాకృష్ణ జనసేనలో చేరికపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇవాళ లేదా రేపు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
- AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
- 12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
వంగవీటి రాధాకృష్ణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. అయితే కొంతకాలంగా ఆయన రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ.. పరిమితంగా మాత్రమే కనిపిస్తున్నారు. సన్నిహితులు, వ్యక్తిగతంగా దగ్గరైన వారిని మాత్రమే కలుస్తున్నారనే చర్చ ఉంది. పార్టీలో తగిన పదవి లేదా రాజకీయ ప్రాధాన్యం దక్కకపోవడమే ఆయన మౌనానికి కారణమా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో రాధాకృష్ణ మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ.. అది కార్యరూపం దాల్చలేదు. అప్పటి నుంచి ఆయన రాజకీయ భవిష్యత్తుపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు జనసేనలో చేరిక వార్తలు తెరపైకి రావడంతో మరోసారి ఆయన పేరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
విజయవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వంగవీటి మోహనరంగా వారసుడిగా రాధాకృష్ణ రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఆయన ఏ పార్టీలో ఉన్నా, విజయవాడ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపగల నేతగా రాజకీయ వర్గాలు భావిస్తుంటాయి. గతంలో జనసేన తరఫున రాధాకృష్ణ విజయవాడ మేయర్‌గా పోటీ చేస్తారనే ప్రచారం కూడా సాగింది. ఇప్పుడు ఆయన జనసేనలో చేరతారనే ప్రచారం నేపథ్యంలో భవిష్యత్తులో ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. రాధాకృష్ణ టీడీపీలో కొనసాగుతారా? లేదా జనసేనలో చేరుతారా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!