CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
- మూడు రోజుల పాటు సీఎం పర్యటన
- రూ.9,100 కోట్ల పనులకు శ్రీకారం
- రైతులు, పారిశ్రామికవేత్తలతో భేటీ
- నవంబర్ 9న భారీ బహిరంగ సభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.9,100 కోట్ల భారీ అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను ప్రారంభించడంతో పాటు రైతులు, పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలతో సీఎం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
పర్యటనలో మొదటి రోజైన శనివారం ఉదయం 11 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలోని యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ హబ్ ఆవరణలో మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించి, మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన అనంతరం, మధ్యాహ్నం 3 గంటలకు హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో కొడంగల్ నివాసానికి చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు.
Also Read
రెండో రోజు నవంబర్ 8వ తేదీ ఉదయం 9:30 నుంచి 10:20 గంటల వరకు స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమయ్యే సీఎం, ఆ తర్వాత పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. ఉదయం 10:30 గంటలకు ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.81 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా హకీంపేటలో నాట్కో సంస్థ సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన జెడ్పీ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభిస్తారు. అలాగే బొంరాస్‌పేటలో జూనియర్ కళాశాల, కొడంగల్, దుద్యాల, హకీంపేట ప్రాంతాలలో నూతన పోలీస్ స్టేషన్లు, దుద్యాలలో రూ.12 కోట్లతో నిర్మించిన సమీకృత మండల కార్యాలయ భవనాన్ని జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం కోస్గి మండలం నాచారంలో రూ.5,060 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రేడియల్ రోడ్డు–2కు శంకుస్థాపన చేసి, కోస్గిలో సైన్స్ మ్యూజియం, దౌల్తాబాద్‌లో పీహెచ్సీ, జూనియర్ కళాశాలను ప్రారంభించి రాత్రికి కొడంగల్‌లో బస చేస్తారు.
పర్యటనలో చివరి రోజైన నవంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు హకీంపేటలో నిర్వహించనున్న భారీ రైతు బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ పర్యటన ద్వారా కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి వేగం మరింత పుంజుకోనుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
-
Off The Record: నెల్లూరు జడ్పీ పీఠంపై టీడీపీలో అసంతృప్త రాగాలు.. అన్నీ వాళ్ళ కోటాకేనా అంటూ అసహనం
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!