Adipurush Advance Bookings in North Belt: ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్గా నటించిన ఆది పురుష్ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తానాజీ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ మైథాలజికల్ మూవీ తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. టి సిరీస్ సంస్థ సుమారు 550 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించిన ఈ భారీ మోషన్ గ్రాఫిక్స్ క్యాప్చర్ మూవీ జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా నటించడమే కాక బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటించడం సినిమాకు నార్త్ బెల్ట్ లో మరింత క్రేజ్ వచ్చేలా చేసింది. ఈ దెబ్బతో దక్షిణాదిలోనే కాకుండా నార్త్ లో కూడా ఈ సినిమా టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది.
Also Read: Adipurush ticket price: ‘ఆదిపురుష్’కి ప్రభుత్వాల మద్దతు.. ఏపీలో కూడా రూ.50 పెంపుకు గ్రీన్ సిగ్నల్!
అసలు తెలుగు రాష్ట్రాలలో బుకింగ్స్ కూడా ఓపెన్ చేయకుండానే పివిఆర్ ఐనాక్స్ చైన్ దాదాపు లక్ష టికెట్లు అమ్మినట్లు ప్రకటించగా ఇప్పుడు కూడా నార్త్ లో ఈ సినిమా టికెట్లను మరింత డిమాండ్ ఏర్పడిందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఢిల్లీ, ముంబై లాంటి నగరాలలో 2000 రూపాయల టికెట్ రేటు పెట్టినా టికెట్లు క్షణాల్లో హాట్ కేకుల లాగా అమ్ముడైపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో అంచనాలు పెంచేయడంతో పాటు సినిమా ధియేటర్లో ప్రతి షో కి ఒక్కొక్క సీటును ఆంజనేయ స్వామి కోసం వదిలి వేస్తున్నట్టు ప్రకటించడం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఈ విషయం మీద కొంత మిశ్రమ స్పందన వచ్చిన ప్రేక్షకులందరూ థియేటర్లకు వెళ్లి సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగానే నార్త్ ప్రేక్షకులు దేవుడికి సంబంధించిన ఎలాంటి సినిమా వచ్చినా ఆదరించడానికి ముందుంటారు. ఇప్పుడు ఆది పురుషుడిగా భావించే శ్రీరాముని ఆదిపురుష్ సినిమాని కూడా అదే విధంగా గుండెల్లో పెట్టుకోవడానికి రెడీ అయిపోయారు.
Also Read: Adipurush: తెలివిగా సైడైన ప్రభాస్.. రికార్డులు చెరిపేస్తున్న ఆదిపురుష్!
ఇప్పటికీ సినిమా రిలీజ్ అవ్వలేదు ప్రస్తుతానికి జరుగుతున్నవి అన్నీ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే. ఆ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఇప్పుడు ప్రభాస్ సినిమా రికార్డులు బద్దలు కొట్టే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాని చూడడానికి ఆసక్తికరంగా ఉన్నామంటూ బుక్ మై షో లో ఒక మిలియన్ ఇంట్రెస్ట్ రాగా ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరుగుతోంది. శుక్రవారం విడుదల కాబోతున్న ఈ సినిమా టికెట్లు నార్త్ బెల్ట్ లో అయితే హాట్ కేకుల్లాగా అమ్ముడుపోతున్నాయి. మొత్తం మీద ప్రభాస్ కి ఈ ఆదిపురుష్ సినిమా నార్త్ లో మంచి క్రేజ్ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. నిజానికి హిందీ మార్కెట్లో ఇప్పటికే 70,000 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో అమ్ముడుపోయాయని హిందీ సినిమా చరిత్రలో ఈ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం చాలా అరుదైన విషయం అని ట్రేడ్ వర్గాల వారు అంచనాలు వేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీమియర్స్ అలాగే మొదటి రోజు వసూళ్లు అన్నీ పరిశీలిస్తే అన్ని భాషల్లో కలిపి 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు కూడా రాబట్టే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.