Revanth Reddy : నిజాం నిరంకుశ పాలనపై ఎక్కుపెట్టిన ఫిరంగి పరకాల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరకాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనపై ఎక్కుపెట్టిన ఫిరంగి పరకాల అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ సార్ పుట్టిన గడ్డ అని, అలాంటి ఈ గడ్డను ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేసే బాధ్యత మాది అని ఆయన హామీ ఇచ్చారు. మచ్చలేని , అవినీతి మరక లేని నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి అని, కేసీఆర్ మతి తప్పి మాట్లాడుతుండో.. మందేసి మాట్లాడుతుండో తెలియదన్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పుపడుతుండు అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. దొరల రాజ్యం కావాలా? ఇందిరమ్మ రాజ్యం కావాలా పరకాల ప్రజలు తేల్చుకోవాలన్నారు రేవంత్ రెడ్డి.
Also Read : Election Commission: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రూ.1760 కోట్లు పట్టివేత.. తెలంగాణలోనే అత్యధికం
Also Read
అంతేకాకుండా.. ఆనాడు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యమని ఆయన గుర్తు చేశారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు ఉచితంగా ఇచ్చే రాజ్యం ఇందిరమ్మ రాజ్యమని ఆయన వెల్లడించారు. వేలాది ఎకరాల దొరల భూములను సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు పంచింది ఇందిరమ్మ రాజ్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి ఇందిరమ్మ రాజ్యంలోనే జరిగిందని, ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పుపట్టిన కేసీఆర్ ముక్కు నేలకురాసి క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సోనియమ్మ మాటంటే శిలాశాసనమని, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచినట్లే అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Also Read : Hyderabad: మైనర్ బాలిక ఆచూకీ లభ్యం.. 5 రోజులు, 200 సీసీ కెమెరాలు వడపోసిన హెడ్ కానిస్టేబుల్
తాజావార్తలు
-
Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
-
Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టం
-
Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
-
Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
-
Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!