Revanth Reddy : ఖర్గేని చంపడానికి కుట్రపై విచారణ చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మణికంఠ నరేంద్ర రాథోడ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఆయన కుటుంబ సభ్యులను హత్య చేస్తామని బెదిరించారని ఆరోపించిన రేవంత్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చిత్తాపూర్ నియోజకవర్గం నుండి ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే పోటీ చేస్తున్నారని, ఖర్గే కుమారునిపై మణికంఠ రాథోడ్ తడిపార్ ని బీజేపీ పోటీలో దింపారన్నారు. అయితే.. ఖర్గే ని రౌడీ షీటర్.. బీజేపీ అవతార్ మణికంఠ రాథోడ్ బెదిరించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఖర్గే కుటుంబాన్ని చంపేస్తా అన్నారని.. ఆడియోలు కూడా బయటకు వచ్చాయన్నారు. బీజేపీ కి రాజ్యాంగం పట్ల నమ్మకం ఉంటే… మణికంఠ రాథోడ్ ని పార్టీ నుండి బహిష్కరించాలని, పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
Also Read : Minister KTR : రాజకీయ నిరుద్యోగులు రాష్ట్ర యువతను రెచ్చగొడుతున్నారు
Also Read
- Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్‌దే.. వరల్డ్ కప్‌లో సూర్యవంశీకి చోటు..
- RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్‌కు చేరిన ఓపెనర్స్..
- RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
ఖర్గే ని చంపడానికి కుట్రపై విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా… కేటీఆర్ కి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదని, కేటీఆర్ పేరే అరువు తెచ్చుకున్నారన్నారు. తెలంగాణతో కేటీఆర్ కి పేరు బంధమే తప్పా..పేగు బంధం లేదని, కేసీఆర్ కుమారుడు అనేదే అర్హత అన్నారు. ఇందిరా గాంధీ కుటుంబం వారసురాలు.. వాళ్ళ కాళ్ళు మొక్కితే నీకు చేసిన తప్పులలో కొంతైన పాపం తగ్గుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి నమూనా అంటే మూడు వేల వైన్స్.. ఆరు వేల బార్లా స్టడీ చేసేది.. ప్రశ్న పత్రాల లీకు లు ఆదర్శంగా తీసుకోవాలా.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకులు అధ్యయనం చేయాలా..? తెలంగాణలో ఏం స్టడీ చేయాలి.. పరాయి రాష్ట్రం నుండి కిరాయి మనుషులను తెచ్చుకుని, సిగ్గులేని మాటలు మానేసి, మర్యాద పూర్వకంగా వచ్చి ప్రియాంక కాళ్ళు మొక్కు, తెలంగాణ ప్రజలను మోసం చేసినం అని క్షమాపణ చెప్పు, అంటూ మంత్రి కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Also Read : GT vs LSG: గుజరాత్ టైటాన్స్ తాండవం.. లక్నో ముందు భారీ లక్ష్యం
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్‌దే.. వరల్డ్ కప్‌లో సూర్యవంశీకి చోటు..
-
Indian Navy Recruitment 2026: భారత నావికాదళంలో బీటెక్ క్యాడెట్ ఎంట్రీకి దరఖాస్తులు.. అర్హత, ఎంపిక వివరాలు ఇవే
-
Gopichand 34 : పట్టాలెక్కిన గోపీచంద్ 34వ మూవీ… షూటింగ్ అప్డేట్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్‌కు చేరిన ఓపెనర్స్..
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!