Allu Arjun: అల్లు అర్జున్ ప్లాన్ అదిరింది.. మైల్ స్టోన్ మూవీకి ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Who Will Allu Arjun’s 25th Film: ‘పుష్ప 2’ సినిమాతో టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను సైతం షేక్ చేసిన ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్.. తన తదుపరి చిత్రాల విషయంలోనూ భారీ ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమా చేస్తున్న బన్నీ.. ఈ చిత్రంతో తన స్థాయిని మరింత పెంచుకోవాలని భావిస్తున్నారు. సినిమా కోసం ఎంత సమయం పట్టినా పర్లేదని, అభిమానుల అంచనాలను మించేలా కంటెంట్ అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఆలస్యం అవుతుండటంతో దాదాపు మూడేళ్లుగా వెండితెరపై బన్నీని చూడలేకపోతున్న అభిమానులు ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు. రాకా వచ్చే ఏడాది విడుదలవుతుందా? లేదా 2028లో ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అన్నది ప్రస్తుతానికి తెలియదు.
రాకా అనౌన్స్మెంట్ వచ్చి ఏడాదిన్నర దాటగా.. టైటిల్ ప్రకటించి కూడా 7-8 నెలలు కావస్తోంది. అయినప్పటికీ చిత్రబృందం ఇప్పటివరకు విడుదల తేదీని ప్రకటించలేదు. ఇతర సినిమాల మాదిరిగా తొందరపడి డేట్ ఖరారు చేసి షూటింగ్ పూర్తి చేయాలనే ఆలోచనలో అట్లీ, అల్లు అర్జున్ లేనట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సమయం తీసుకుంటూనే.. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని భావిస్తున్నారట. రాకాతో బిజీగా ఉన్నప్పటికీ బన్నీ తన తదుపరి ప్రాజెక్టులపైనా దృష్టి పెట్టారు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పాటు మరో 2-3 దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నట్లు టాక్.
Also Read
- Amit Shah: రామాయణ టీమ్‌తో అమిత్ షా భేటీ.. రణ్‌బీర్, సాయిపల్లవికి అభినందనలు
- Social Media Star: మహేష్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన చిన్నారి..!
- Vrushakarma Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్.. పీక్స్‌కు చేరిన అంచనాలు!
- Varanasi Release Date: వారణాసి విడుదలపై ఉత్కంఠ.. ఏప్రిల్ 7న రావడం కష్టమేనా?.. రాజమౌళి కీలక నిర్ణయం!
సరైనోడు సినిమాతో బన్నీకి క్లాస్, మాస్ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ తీసుకొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో మరోసారి చేయనున్నారు. ఇప్పటికే బోయపాటి చెప్పిన కథను విన్నాడని, ప్రాజెక్టును ఖరారు చేయడమే మిగిలిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక మలయాళ నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్ కూడా బన్నీ లైనప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో పలుమార్లు బన్నీతో సినిమా చేసే అవకాశాలపై హింట్స్ ఇచ్చిన బాసిల్.. తాజాగా అన్నీ కుదిరితే వచ్చే ఏడాది తన దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఓ బాలీవుడ్ దర్శకుడితోనూ అల్లు అర్జున్ సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐకాన్ స్టార్ తన కెరీర్లో 25వ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే అవకాశముంది. ఆ మైలురాయి సినిమాకు ఎవరిని దర్శకుడిగా ఎంపిక చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. రాకా తర్వాత లోకేశ్ కనగరాజ్, బోయపాటి శ్రీను, బాసిల్ జోసెఫ్‌లలో ఎవరితో ముందుగా సినిమా పట్టాలెక్కిస్తాడు?.. 25వ చిత్రం ఎవరితో చేస్తాడు?.. అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Allu Arjun: అల్లు అర్జున్ ప్లాన్ అదిరింది.. మైల్ స్టోన్ మూవీకి ఎవరు?
-
DGP CV Anand: “సిబ్బంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి”.. ట్రాఫిక్ సమస్యలపై డీజీపీ కీలక వ్యాఖ్యలు..
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!
-
Amit Shah: రామాయణ టీమ్‌తో అమిత్ షా భేటీ.. రణ్‌బీర్, సాయిపల్లవికి అభినందనలు
-
YSRCP Election Boycott : సర్పంచ్ సీటుపై రిజర్వేషన్ రగడ.. ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ
ట్రెండింగ్
-
Social Media Star: మహేష్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన చిన్నారి..!
-
Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!
-
Vrushakarma Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్.. పీక్స్‌కు చేరిన అంచనాలు!
-
Viral Cricket Video: బైక్‌పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!