Haryana Governor: నెల్లూరులోని పప్పుల వీధిలో గల వైవీఎం నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే విగ్రహాలను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ, స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్యానా గవర్నర్ మాట్లాడుతూ.. దేశంలో పేదరికం పోవాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం ఆయన పోరాడారు.. తన సతీమణి సావిత్రి బాయి పూలే ద్వారా మహిళలను విద్యావంతులను చేశారు అని గర్నవర్ బండారు దత్తాత్రేయ చెప్పుకొచ్చారు.
Read Also: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో రాజేంద్రప్రసాద్ భేటీ..
ఇక, సావిత్రి బాయి పూలేను సంఘ సేవకురాలుగా మార్చిన ఘనత జ్యోతిరావు పూలేది అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆ కాలంలో మహిళా విద్యపై నిషేధం ఉంది.. సావిత్రి బాయి ద్వారా మహిళను విద్యావంతులను చేశారు.. పూలే దంపతుల సేవలను భావితరాలకు తెలియజేయాలి అని ఆయన కోరారు. వారి జీవిత చరిత్రను వచ్చే తరాలకు తెలిసేలా చూడాలన్నారు.