టెక్నాలజీ ప్రపంచంలో ప్రతిరోజూ కొత్త కొత్త గాడ్జెట్లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ ప్రొడక్ట్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ, వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా రూపుదిద్దుకుంటున్న ల్యాప్‌టాప్‌లలో Redmi Book Pro 2025 కూడా ఒకటి. రెడ్ మీ కంపెనీ తాజా ల్యాప్‌టాప్ Redmi Book Pro 2025, అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన హార్డ్‌వేర్, ఆకట్టుకునే డిజైన్‌తో మార్కెట్లోకి రానున్నది. ఇది రెడ్ మీ బ్రాండ్ హై-ఎండ్ ల్యాప్‌టాప్ లైనప్ 2025 వేరియంట్ అని టాక్.
Also Read:Haryana Governor: దేశంలో పేదరికం పోవాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించిన వ్యక్తి జ్యోతిరావు పూలే..
గిజ్మోచినా నివేదిక ప్రకారం, రెడ్ మీ నుంచి రాబోయే Redmi Book Pro 2025 మోడల్‌ను ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్‌తో రానున్నది. ఈ విషయాన్ని షియోమి ఉత్పత్తి మార్కెటింగ్ డైరెక్టర్ మా జియు చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో పంచుకున్నారు. లీకైన వివరాల ప్రకారం Redmi Book Pro లో Xiaomi PC Manager ముందే ఇన్‌స్టాల్ చేయబడిందని తెలుస్తుంది.
Also Read:Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో రాజేంద్రప్రసాద్ భేటీ..
ల్యాప్‌టాప్‌లు ఇంటెల్ ఆర్క్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్‌తో వస్తాయని నిర్ధారించే స్టిక్కర్లు కూడా కనిపించాయి. ప్రస్తుతానికి, ఇంటెల్ కోర్ అల్ట్రా 5 మొదటి తరం చిప్‌సెట్ లేదా సిరీస్ 2 చిప్‌సెట్ అనేది స్పష్టంగా తెలియరాలేదు. గ్రాఫిక్స్ సెట్టింగ్‌ల వివరాలు కూడా ప్రస్తుతానికి వెల్లడించలేదు, కానీ నోట్‌బుక్ సగటున 67 FPS సాధించగలిగిందని, గరిష్ట ఫ్రేమ్ రేట్ 75 FPS, అతిపెద్ద డ్రాప్ కేవలం 59 FPS మాత్రమేనని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.