హాత్ సే హాత్ జోడో పేరిట టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఆయన మాట్లాడుతూ.. సమ్మక్క – సారక్క ఆశీర్వచనాలతో పాదయాత్ర మొదలు పెట్టానని, ఇల్లందు గడ్డ కాంగ్రెస్ అడ్డా అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘ఇల్లందు బొగ్గు గనులు మూసివేసి 2 వేల మంది కార్మికుల జీవనోపాధికి దూరం చేసింది. 40 వేల సింగరేణి కార్మికుల హక్కులను అధికార కార్మిక సంఘం చేరింది. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఏజెన్సీలో ఇండ్లు , నీళ్లు లేవనే ఫిర్యాదులు వస్తున్నాయి. మహిళ రుణాలు మాఫీ చేయలేదు. సీతక్క పోడు భూమి గురించి అసెంబ్లీలో మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ రంకెలేసే పని చేసాడు. రాహుల్ గాంధీ బడుగు బలహీన వర్గాలకు అధికారంలోకి వచ్చిన తర్వాత అండగా ఉండబోతున్నాడు. ఫారెస్ట్ అధికారుల దాడులు పోడు భూమి సాగుదారుల పై ఎక్కువవుతున్నాయి.. గోదావరి పరివాహకా ప్రాంతంలో ఉన్న ఏజెన్సీ వాసులు కాంగ్రెస్ కు తోడుగా ఉన్నారనే భయం కలిగి నిన్న అసెంబ్లీలో హడావుడి చేసారు.
Also Read : Semiconductors : కొత్త యుద్ధంలో తలపడుతున్న అమెరికా – చైనా
పోడు భూముల సాగు దారుల ఇండ్ల పై దాడులు చేసిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిది.. అర్హులైన వాళ్లకు భూములు ఇవ్వాలి. కాంగ్రెస్ సభకు పోతే పోడు భూముల పట్టాలు రావని బెదిరిస్తున్నారు. ఏజెన్సీలో ఓట్లు అడగటానికి వస్తే చెట్లకు కట్టేసి కొట్టే రోజు వస్తది. తరతరాలుగా నమ్ముకొని ఉన్న భూమికి పట్టాలు ఇవ్వడం లేదు. కేసిఆర్ ను నమ్మితే మునిగినట్లే. ఎస్టీ రిజర్వేషన్లను పెంచితామనే హామీ ఇచ్చి మరిచాడు.. ఎస్టీలలో ఉన్న అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేస్తున్నాడు. వాల్మీకి బోయలను మోసం చేసాడు .. పిట్టలను కొట్టినట్లు కొట్టేందుకు బోయలు సిధ్ధంగా ఉన్నారు. కేసిఆర్ మీడియా ఫార్మ్ హౌస్ కు వెళ్లి కాంగ్రెస్ సభకు వచ్చే జనాలను చూపెట్టాలని కోరుతున్నా.’ అంటూ ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ దంపతులపై తీవ్ర ఆరోపణలు చేశారు రేవంత్.