తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై బీర్ల ఐలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా బడ్జెట్ ఉందని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేక బడ్జెట్ పై విమర్శలు చేస్తోందన్నారు. పేద, బడుగు, రైతు, మహిళలకి ఉపయోగపడేలా ఉన్న ఈ బడ్జెట్ ను జీర్ణించుకోలేక మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ట్రిలియన్ డాల్లర్ కు చేర్చేందుకు ముఖ్యమంత్రి కష్టపడుతున్నారు అని తెలిపారు.
Also Read:Marri Rajasekhar: ప్రస్తుతానికి రాజీనామా చేశా.. అన్ని విషయాలు వెల్లడిస్తా!
బడ్జెట్ లో మహిళలకు, రైతులకు పెద్దపీట వేసాము..యువతకి యువ వికాసం అంటే బీఆర్ ఎస్ విమర్శలు చేస్తుంది.. గతంలో దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తామని మోసం చేశారు బీఆర్ఎస్ వాళ్లు.. తెలంగాణ ప్రజలను కూని చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాళేశ్వరం పేరుతో కూలేశ్వరం చేశారు.. మామా, అల్లుడు, బామ్మర్ది కలిసి తెలంగాణను మోసం చేశారు. ఈ రోజు మేము ప్రవేశపెట్టిన బడ్జెట్ రైసింగ్ తెలంగాణకు సూచిక అని బీర్ల ఐలయ్య తెలిపారు.