హైదరాబాద్ గోల్నాకలో కాంగ్రెస్ పార్టీ అంబర్ పేట నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు వి. హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాకలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి కాంగ్రెస్ పార్టీపై నెట్టాలని చూస్తున్నారు అని ఆరోపించారు. మొండి కత్తితో దాడి చేసింది కాంగ్రెస్ వ్యక్తి అని కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు.. దాడి ఘటనను కాంగ్రెస్ ఖాతాలో వేయాలని కుట్ర చేస్తున్నారు.. కాంగ్రెస్ పై తప్పుడు ఆరోపణలు చేసిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి బీజేపీకి చెందిన వ్యక్తి.. కేసీఆర్ కు నేను సవాల్ చేస్తున్నా.. చేతనైతే నిరూపించు అని అన్నారు.
Read also: Yashoda Hospital: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హెల్త్ బులిటెన్ విడుదల.. పరిస్థితి ఎలా ఉందంటే..?
కాంగ్రెస్ సిద్దాంతం అహింస.. కాంగ్రెస్ ఎప్పుడూ హింసకు పాల్పడదు అని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ను ఓడించాలని బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. దాడి జరిగిన వెంటనే ఇంటలిజెన్స్ అధికారులు సీఎంకి వివకాలు ఇస్తారు.. ఎవరు దాడి చేశారు.. ఎవరిపై చేశారు అనేది.. బీజేపీ-బీఆర్ఎస్ పరస్పర దాడులు చేసుకుని.. నింద కాంగ్రెస్ పార్టీ మీద వేయాలని చూస్తున్నారు అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న భయం పట్టుకుంది వాళ్లకు అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.