శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో తెలంగాణ యూత్ డిమాండ్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్ 9కి తెలంగాణలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. సోనియాగాంధీ జన్మదినంతో పాటు కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ప్రకటించిన రోజని ఆయన వ్యాఖ్యానించారు. డిసెంబర్ 9 కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమని, ఆ రోజు కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ సభ్యలకు ఇన్సూరెన్స్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని, సభ్యత్వ కార్డుల పంపిణీకి కార్యాచరణ చేపట్టాలన్నారు.
Also Read : Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు
డిసెంబర్ 9న రక్తదాన శిబిరాన్ని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ లో ఏర్పాటు చేయాలని, డివిజన్ ల వారీగా సమీక్షించి డిసెంబర్ 6 లోపు దాతల పేర్లు నమోదు చేసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. రక్తదానం చేసినవారికి సర్టిఫికెట్, మెమెంటో అందజేసి గౌరవిద్దామని, సోనియా జన్మదిన సందర్బంగా వెయ్యి మంది పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్నారు. చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలకు 2లక్షల బీమా చెక్కులను అందజేయాలని, పని విభజన చేసుకుని కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి నేతలను ఆహ్వానించాలన్నారు రేవంత్ రెడ్డి.
Also Read : Woman Drinker : దేంట్లో మేం తక్కువ.. తాగుతాం.. తాళాలు పగలకొడతాం