ఆ వ్యక్తి వయసు 70 ఏళ్లు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. కృష్ణా రామా అనుకుంటూ ఇంట్లో కూర్చోవాల్సిన ఈ వయసులో దుర్భుద్ధి ప్రదర్శించాడు. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి 38.73లక్షలు పోగొట్టుకున్నాడు. ఇంతకీ ఏం చేశాడంటే.. హైదరాబాద్ కి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి(70)ని హనీ ట్రాప్‌లో ఇరికించి రూ. 38.73లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్ళు. ఫేస్ బుక్ లో ఆ వృద్ధుడికి మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ మహిళ ఇతడితో ఛాటింగ్ చేసింది. తండ్రి తమను వదిలేశాడని.. తల్లి టైలర్ అని పరిచయం చేసుకుంది. దీంతో ఆ వృద్ధుడు ఇదే ఛాన్స్ అనుకుని ఛాటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు.
READ MORE: YS Sharmila: జగన్, కేసీఆర్ ఎంత క్లోజ్ అంటే..? షర్మిల షాకింగ్ కామెంట్స్..
ఛాటింగ్ చేసేందకు ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయాలని ఆ వృద్ధుడికి కేబుల్ ఆపరేటర్ నంబర్ ఇచ్చింది మహిళ. ఆమె ఇచ్చిన కేబుల్ ఆపరేటర్ నంబర్‌కి ఫోన్ చేసి రూ.10వేలు పంపాడు వృద్ధుడు. అనంతరం మహిళ నుంచి ఫేస్ బుక్ లో ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆ వృద్ధుడు కేబుల్ ఆపరేటర్ తో ఛాటింగ్ చేశాడు. సదరు మహిళ జబ్బు పడిందని.. ఆస్పత్రిలో ఉందని కేబుల్ ఆపరేటర్ చెప్పాడు. దీంతో ఆ వృద్ధుడు రూ.10లక్షలు పంపాడు. అనంతరం క్రెడిట్ కార్డు నుంచి మరో రూ. 2.65 లక్షలు చెల్లించాడు. కొన్ని రోజుల తర్వత మహిళ దుబాయ్ వెళ్ళిపోయిందని.. ఆమె కాంటాక్ట్స్ ఏమీ లేవని కేబుల్ ఆపరేటర్ చెప్పాడు.
READ MORE: KCR: కేసీఆర్ సంచలన నిర్ణయం.. రైతుల పక్షాన మరో పోరాటం..!
తన తల్లి, సోదరి మీతో మాట్లాడాలని అనుకుంటున్నారని కేబుల్ ఆపరేటర్ ఆ వృద్ధుడికి చెప్పాడు. అతడికి కోరిక ఇంకా తగ్గలేదు. కొద్ది రోజుల పాటు కేబుల్ ఆపరేటర్ తల్లి, సోదరితో లైంగికంగా ఛాటింగ్ చేశాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కేబుల్ ఆపరేటర్ బెదిరించాడు. పోలీస్ కానిస్టేబుల్ పేరుతో మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని బాధితుడికి సందేశం పంపాడు. బాలిక చదువు, తల్లి డ్వాక్రా రుణం చెల్లింపు నిమిత్తం రూ.12.5లక్షలు చెల్లించాడు వృద్ధ బాధితుడు. సెటిల్ చేసిన కానిస్టేబుల్, ఎస్సైకి రూ. లక్ష సమర్పించుకున్నాడు. కొత్త ఎస్సై వచ్చానని.. కేసు అవ్వకుండా ఉండాలంటే రూ. 10లక్షలు ఇవ్వాలని మరో డిమాండ్ వచ్చింది. దీంతో బాధితుడు మరో రూ. ఏడు లక్షల పంపాడు. ఇలా ఆ వృద్ధుడు మొత్తం రూ. 38.73లక్షలు పొగొట్టుకున్నాడు. ఇన్ని డబ్బులు పొగొట్టుకోవడానికి కారణం.. ఈ వయసులో కూడా లైంగిక కోరికలు ఉండటం.