ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్ (PBKS), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్‌కతా, పంజాబ్ కింగ్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకాబోతోంది. ఈ మ్యాచ్ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్‌లో జరుగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ తన చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. PBKS ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 గెలిచింది. KKR తన చివరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)ను ఓడించింది.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, నేహాల్ వధేరా, జోష్ ఇంగ్లిస్, శశాంక్ సింగ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్,మార్కో జాన్సన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్, సునీల్ నరైన్, అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, అన్రిక్ నోర్ఖియా, వరుణ్ చక్రవర్తి.