మరో రెండ్రోజుల్లో జూన్ నెల ముగిసి జూలై నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. జూలై నెల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. జూలైలో భారీగా బ్యాంక్ సెలవులు ఉండనున్నాయి. జూలై నెలలో 13 రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి. ఇందులో రెండవ, నాల్గవ శనివారాలు అలాగే ఆదివారం సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవులు ప్రాంతాలను బట్టీ మారుతూ ఉంటాయని గుర్తుంచుకోవాలి. సెలవుల ఎప్పుడుంటాయో తెలుసుకుంటే మీ బ్యాంకు పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవచ్చు.
జూలై నెలలో బ్యాంక్ సెలవుల లిస్టు
జూలై 3, 2025: ఖర్చీ పూజ కారణంగా ఈ రోజు అగర్తల జోన్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.
5 జూలై 2025: గురు హరగోవింద్ జీ పుట్టినరోజు సందర్భంగా జమ్మూ, కాశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు.
6 జూలై 2025: ఆదివారం ప్రభుత్వ సెలవు.
జూలై 12, 2025: రెండవ శనివారం కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
13 జూలై 2025: ఆదివారం కావడంతో ఈ రోజు బ్యాంకులు మూసివేయబడతాయి.
14 జూలై 2025: బెహ్ దిఖ్లాం కారణంగా ఈ రోజు షిల్లాంగ్ జోన్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.
Also Read:Allu Arjun : బ్లాక్ బస్టర్ డైరెక్టర్లను వదులుకున్న బన్నీ..!
16 జూలై 2025: హరేలా పండుగ కారణంగా, ఈ రోజు డెహ్రాడూన్ జోన్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.
17 జూలై 2025: యు తిరోత్ సింగ్ వర్ధంతి కారణంగా ఈ రోజు షిల్లాంగ్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.
19 జూలై 2025: కేర్ పూజ కారణంగా ఈ రోజు అగర్తల జోన్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.
20 జూలై 2025: ఆదివారం ప్రభుత్వ సెలవు.
26 జూలై 2025: నాల్గవ శనివారం కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి.
27 జూలై 2025: ఆదివారం ప్రభుత్వ సెలవు.
28 జూలై 2025: ద్రుక్పా త్సే-జీ కారణంగా ఈ రోజు గాంగ్‌టక్ జోన్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.
Also Read:Viral Video: ప్రాక్టీస్ సెషన్‌లో WWE.. బౌలింగ్ కోచ్‌తో కుస్తీ పడిన టీమిండియా బౌలర్లు..
సెలవు రోజుల్లో ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవ కొనసాగుతుంది. చెక్ క్లియరెన్స్, RTGS, NEFT వంటి సేవలలో ఆలస్యం జరగవచ్చు. అయితే, డబ్బు లావాదేవీలు లేదా బిల్లు చెల్లింపులు వంటి లావాదేవీలను ఆన్‌లైన్ బ్యాంకింగ్, ATMల ద్వారా చేయవచ్చు.