Amit Shah: 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా శుక్రవారం రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పండరియా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పేద గిరిజనులను కాంగ్రెస్ ప్రభుత్వం మతమార్పిడి చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ స్కాములను వెలికితీసి, అవినీతికి పాల్పడిన వ్యక్తుల్ని జైలుకు పంపుతామని అమిత్ షా అన్నారు.