AP High Court: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు స్వల్ప ఊరట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు ఊరట లభించింది. నవంబరు 7వ తారీఖు వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఆ పిటిషన్ పై విచారణను నవంబరు 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ్టితో ముగియడంతో హైకోర్టులో వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్ లో ఉన్న నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తీర్పు రింగు రోడ్డు కేసుకు కూడా వర్తిస్తుందని, అందుకే విచారణను నవంబరు 7కు వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు లాయర్లు కోరగా దానికి కోర్టు ఓకే చెప్పింది. ఇక, విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు పీటీ వారెంట్ పై స్టేను కూడా నవంబర్ 7వ తేదీ వరకు పొడిగించింది.
Read Also: Fraud: ప్రభుత్వ పదవులు ఇప్పిస్తానంటూ కోట్లు కొట్టేసిన యువకుడి అరెస్ట్..
Also Read
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
- Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో "మాస్క్ మ్యాన్".. ఎవరనేది తెలిసింది
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
అయితే, మరోవైపు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను టీడీపీ నేతల బృందం నేటి (బుధవారం) సాయంత్రం కలువనుంది. సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్‌ను కలిసి చంద్రబాబు అక్రమ అరెస్ట్, నాయకుల గృహనిర్బంధం అంశాలను ఏపీ గవర్నర్ దృష్టికి టీడీపీ నేతలు తీసుకు వెళ్లనున్నారు. ఇక, చంద్రబాబు అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను కూడా గవర్నర్‌కు వివరించే ప్రయత్నం టీడీపీ నేతలు చేసే అవకాశం కూడా ఉంది. గవర్నర్‌ను కలిసే టీడీపీ బృందంలో ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్, బోండా ఉమాలు ఉన్నారు.
తాజావార్తలు
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..