ఐపీఎల్ సందడి కొనసాగుతోంది. క్రికెట్ ప్రియులకు మరింత జోష్ ఇచ్చేలా రిలయన్స్ జియో కీలక నిర్ణయం తీసుకుంది. జియో పాపులర్ అన్ లిమిటెడ్ ఆఫర్ ను ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఈ ఆఫర్ గడువు మార్చి 31తో ముగియడంతో క్రికెట్ సీజన్, హైస్పీడ్ కనెక్టివిటీకి పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి ఈ ఆఫర్ ను పొడిగించారు. ఈ అపరిమిత ఆఫర్ రూ. 299 అంతకంటే ఎక్కువ ధర గల ప్రీపెయిడ్ ప్లాన్స్ కు వర్తిస్తుంది. ఈ ఆఫర్ తో కస్టమర్లకు అనేక ప్రయోజనాలు అందనున్నాయి.
Also Read:Sree Leela: పాపం శ్రీలీల… అంతన్నాది ఇంతన్నాది కానీ?
ఈ అపరిమిత ఆఫర్‌లో టీవీ/మొబైల్‌లో 90 రోజుల పాటు 4Kలో ఉచిత JioHotstar సబ్ స్క్రిప్షన్ ఉంటుంది. ఈ సీజన్‌లోని ప్రతి మ్యాచ్‌ను మీరు టీవీలో లేదా మీ మొబైల్‌లో 4Kలో పూర్తిగా ఉచితంగా చూడవచ్చు. 50 రోజుల ఉచిత JioFiber / AirFiber ట్రయల్ కనెక్షన్ అందిస్తుంది. JioAirFiber 800+ టీవీ ఛానెల్‌లు, 11+ OTT యాప్‌లు, అపరిమిత Wi-Fiతో హై స్పీడ్ ఇంటర్నెట్ ను అందిస్తుంది. రోజుకు 2GB లేదా అంతకంటే ఎక్కువ అందిచే ప్లాన్లపై అపరిమిత 5G డేటాను అందిస్తుంది.
Also Read:Minister Nadendla Manohar: కొత్త రేషన్ కార్డులపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
జియోలో ఇప్పటికే ఉన్న కస్టమర్లు అర్హత కలిగిన ప్లాన్లతో రీచార్జ్ చేసుకోవడం ద్వారా ఆఫర్ ను పొందొచ్చు. మార్చి 17కు ముందు రీచార్జ్ చేసుకున్న కస్టమర్లు రూ. 100 యాడ్ ఆన్ ప్యాక్ తో ప్రయోజనాలను పొందొచ్చు. జియో హాట్‌స్టార్ ప్యాక్ మార్చి 22, 2025 నుంచి 90 రోజుల పాటు యాక్టివేట్ చేయబడుతుంది. మరిన్ని వివరాల కోసం, కస్టమర్లు జియో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఆఫర్ గురించి మరిన్ని వివరాల కోసం 60008-60008 కు మిస్డ్ కాల్ ఇచ్చి తెలుసుకోవచ్చు.