Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా మరోసారి నిలిచిపోయాయి రిజిస్ట్రేషన్లు.. రిజిస్ట్రేషన్ల కోసం ప్రవేశపెట్టిన 2.0 సాఫ్ట్‌వేర్ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. సర్వర్ సమస్యతో ఉదయం నుండి రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ లు నిలిచిపోయాయి. సోమవారం, దశమి కావడంతో రిజిస్ట్రేషన్ ల కొరకు భారీగా తరలివచ్చారు ప్రజలు.. ఉదయం నుండి రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చింది.. కార్డ్ ప్రైమ్ లో తరచూ సమస్యలు తలెత్తుతున్న పట్టించుకోవడం లేదని.. రోజూ మాకు ఆఫీసులు చుట్టూ తిరగడమే పనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. దానికి తోడు సచివాలయాల్లోను రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించిన నేపథ్యంలో సర్వర్ సమస్య ఎక్కువగా వస్తుందంటున్నారు.. వెంటనే సాంకేతిక సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా సర్వర్లు మొరాయించడంతో ఏపీలో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే కాగా, కార్డ్ ప్రైమ్ లో తరచూ తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని.. మళ్లీ మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలు.
Read Also: Ambajipeta Producer: అంత పెద్ద సినిమాలు చేసి, ఈ సినిమా ఎందుకు చేస్తున్నావని అడిగారు