Ambajipeta Marriage Band Producer Dheeraj Comments: ఈ ఏడాది బిగినింగ్ లోనే టాలీవుడ్ కు మరో సూపర్ హిట్ ఇచ్చింది “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా. సుహాస్, శివాని నాగరం జంటగా నటించిన ఈ చిత్రాన్ని జీఏ 2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయాన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దర్శకుడు దుష్యంత్ కటికినేని రూపొందించారు. శరణ్య ప్రదీప్, నితిన్ కీ రోల్స్ చేశారు. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తున్న “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా ఒప్పుకునే టైమ్ కు నేను కో ప్రొడ్యూస్ చేసిన డీజే టిల్లు, బేబి మూవీస్ హిట్ అయ్యాయి. అంత పెద్ద సినిమాలు చేసిన నువ్వు ఈ సినిమా ఎందుకు చేస్తున్నావు అని కొందరు అడిగారు. అవి వేరే జానర్ మూవీస్, ఈ సినిమా జానర్ వేరు అని చెప్పానని అన్నారు.
Raja The Raja : కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా “రాజా ది రాజా” మూవీ లాంఛ్
నా దృష్టిలో “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ఒక జెన్యూన్ మూవీ, ఈ కథ విన్నప్పుడు నాకు అదే ఫీలింగ్ కలిగింది. కొందరు స్టార్ హీరోను తీసుకో అని చెప్పినా..నేను సుహాస్ అయితేనే ఈ కథకు కరెక్ట్ అని నమ్మా, చాలా మంది కొత్త వాళ్లకు మేము ఒక ప్లాట్ ఫామ్ ఇచ్చామనే సంతృప్తి ఏర్పడింది. నాతో పాటు సుహాస్, డైరెక్టర్ దుష్యంత్ ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిలబెట్టారు, వాళ్లందరికీ థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షో వేసి..చూసిన ఆడియెన్స్ తో మా మూవీ టీమ్ కు ఇంటరాక్షన్స్ చేయిస్తున్నాం, మాకు సపోర్ట్ గా ఉన్న డైరెక్టర్ సాయి రాజేష్ కు థ్యాంక్స్ చెబుతున్నా అన్నారు. ఈ సినిమా ద్వారా ఫలానా కులాన్ని కించపరిచారనే కాంట్రవర్సీ జరగకూడదని స్క్రిప్ట్ నుంచి ఫస్ట్ కాపీ వరకు ప్రతి సందర్భంలో జాగ్రత్తలు తీసుకున్నాం అని ఆయన అన్నారు.