మహిళల 76 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత మహిళా రెజ్లర్ రితికా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె 12-2తో హంగేరీకి చెందిన బెర్నాడెట్ నాగిని టెక్నికల్ సుపీరియారిటీను ఓడించింది. మొదటి రౌండ్ నుంచి రితికా ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించింది. ఈ క్రమంలో భారీ తేడాతో విజయం సాధించింది.
పారిస్ ఒలింపిక్స్ లో భారత స్టార్ రెజ్లర్ నిషా దహియా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. మహిళల 68 కిలోల బరువు విభాగంలో ఉత్తర కొరియాకు చెందిన పాక్ సోల్ గమ్‌తో తలపడింది. అయితే, ఈ పోటీ నిషాకు చాలా బాధాకరంగా మారింది. మూడు నిమిషాల తర్వాత 8-2తో ఆధిక్యంలోకి వెళ్లిన నిషా.. మ్యాచ్ ముగియడానికి 33 సెకన్లు ఉండగా నిషా గాయపడింది. దీంతో మ్యాచ్ నిలిపివేసి ఆమె చేతికి బ్యాండ్ కట్టారు. అయితే.. బ్యాండ్ కట్టిన గానీ..…
టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్, పారిస్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు మించి వెళ్లలేకపోయింది. పారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గెన్ పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన మహిళల 75 కేజీల క్వార్టర్ ఫైనల్లో చైనా క్రీడాకారిణి, వరల్డ్ నెంబర్-1 బాక్సర్ లీ కియాన్ చేతిలో 1-4 తేడాతో ఓటమి పాలయ్యారు.
ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భాగంగా.. భారత ఆటగాళ్లు కొందరు సత్తా చాటుతుంటే.. మరికొందరు ఒలింపిక్స్ నుంచి నిష్క్రమిస్తున్నారు. ఇప్పటికే భారత్ రెండు కాంస్య పతకాలు సాధించింది. మరి కొందరు ఆటగాళ్లు సెమీ ఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్, ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. బుధవారం జరిగిన ఒలింపిక్స్ రౌండప్ ఎలా ఉందో తెలుసుకుందాం.
మహిళా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ ప్యారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. 4-2తో జియాన్ జెంగ్‌పై గెలిచి ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. 51 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఆకుల 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10 తేడాతో విజయం సాధించాది. దీంతో టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో ఒలింపిక్స్‌లో చివరి-16 రౌండ్‌కు చేరిన రెండో మహిళా క్రీడాకారిణిగా శ్రీజ నిలిచింది. భారత మహిళా బాక్సర్ లోవ్లినా మహిళల 75 కేజీల విభాగంలో బోర్గోహైన్ రౌండ్…
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత మహిళల ఆర్చరీ జట్టు శుభారంభాన్ని అందించింది. దీంతో.. క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. భజన కౌర్, దీపిక కుమారిలతో పాటు అంకిత భకత్ అద్భుత ప్రదర్శన చేయడంతో భారత్ టాప్-4లో నిలిచింది. ఈ ముగ్గురు ఆర్చర్లు కలిసి 1983 పాయింట్లు సాధించారు. అంకిత భకత్ (666) పాయింట్లు చేసింది. భజన్ కౌర్ (659), దీపికా కుమారి (658) పాయింట్లు సాధించింది. వ్యక్తిగత విభాగంలో అంకిత తృటిలో టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయింది.