పారిస్ 2024 ఒలింపిక్స్‌లో మహిళల 76 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో శనివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌లో రీతికా హుడా ఓటమి పాలైంది. 1-1తో కిర్గిస్థాన్‌కు చెందిన టాప్-సీడ్ ఐపెరి మెడెట్ కైజీ చేతిలో ఓడిపోయింది. కైజీ ఫైనల్‌కు చేరితే.. రిపీచేజ్ రౌండ్‌లో రీతికా కాంస్య పతకాన్ని సాధించే అవకాశం ఉంది. అంతకుముందు రీతికా 12-2 టెక్నికల్ ఆధిక్యతతో హంగరీకి చెందిన బెర్నాడెట్ నాగిపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరింది. ఈ క్రమంలో.. ఓటమి పాలవ్వడంతో కాంస్య…
మహిళల 76 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత మహిళా రెజ్లర్ రితికా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె 12-2తో హంగేరీకి చెందిన బెర్నాడెట్ నాగిని టెక్నికల్ సుపీరియారిటీను ఓడించింది. మొదటి రౌండ్ నుంచి రితికా ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించింది. ఈ క్రమంలో భారీ తేడాతో విజయం సాధించింది.
2024 పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల రెజ్లింగ్‌లో భారత ఆటగాడు అమన్ సెహ్రావత్ సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాడు. సెహ్రావత్ 12-0తో అల్బేనియాకు చెందిన జెలిమ్‌ఖాన్ అబాకరోవ్‌పై విజయం సాధించాడు.
ఒలింపిక్ క్రీడల సమయంలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు భారత రెజ్లర్ అంతిమ్ పంఘల్‌పై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) చర్యలు తీసుకుంది. మూడేళ్లపాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
WWE Event: నగరంలో ప్రతిష్టాత్మక వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) పోరుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఈ ఈవెంట్ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో ఎదురుచూస్తున్నారు.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో రజత పతకం దక్కింది.. కుస్తీ వీరుడు రవికుమార్ సిల్వర్ మెడల్ గెలిచాడు.. పురుషుల 57 కిలోల విభాగంలో ఫైనల్‌లో రష్యా రెజ్లర్ చేతిలో ఓటమి పాలయ్యాడు రవికుమార్.. దీంతో.. ఆయన పసిడి పతకంపై పెట్టుకున్న ఆశలు ఆవిరికాగా… రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. రష్యా రెజ్లర్‌తో పోరాడి 4-7తో ఓడిపోయాడు రవికుమార్ దహియా.. ఫైనల్ ఓడినా ఆయనకు రజతం దక్కగా.. ఒలింపిక్స్ చరిత్రలోనే సిల్వర్ గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా చరిత్ర సృష్టించాడు…