మహిళల 76 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత మహిళా రెజ్లర్ రితికా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె 12-2తో హంగేరీకి చెందిన బెర్నాడెట్ నాగిని టెక్నికల్ సుపీరియారిటీను ఓడించింది. మొదటి రౌండ్ నుంచి రితికా ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించింది. ఈ క్రమంలో భారీ తేడాతో విజయం సాధించింది.