Redmi A4 5G Price: 50 ఎంపీ కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ.. 8 వేలకే రెడ్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్!
- రెడ్‌మీ నుంచి సూపర్ 5జీ మొబైల్
- మొట్టమొదటి ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ ఇదే
- 50 ఎంపీ కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘షావోమీ’కి చెందిన సబ్‌బ్రాండ్ రెడ్‌మీ.. బడ్జెట్ ధరలో సూపర్ 5జీ మొబైల్‌ను లాంచ్ చేసింది. ఏ సిరీస్‌లో ‘రెడ్‌మీ ఏ4’ 5జీని ఈరోజు భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. ఏ సిరీస్‌లో లాంచ్ అయిన మొదటి 5జీ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జన్2 ప్రాసెసర్‌తో వచ్చిన మొట్టమొదటి ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ ఇదే. రెడ్‌మీ ఏ4 ధర రూ.8,499లే అయినా.. 50 ఎంపీ కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండడం విశేషం.
రెడ్‌మీ ఏ4 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.8,499గా ఉండగా.. 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.9,499గా ఉంది. పర్పుల్, బ్లాక్ కలర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. నవంబర్ 27 నుంచి రెడ్‌మీ ఏ4 5జీ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఎంఐ వెబ్‌సైట్, అమెజాన్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్ చూసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
Also Read: Virat Kohli: ఈ పదేళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా.. కోహ్లీ పోస్ట్ వైరల్! గందరగోళంలో ఫాన్స్
రెడ్‌మీ ఏ4 5జీలో 6.88 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండగా.. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేటుతో వస్తోంది. ఆండ్రాయిడ్ 14 హైపర్ ఓస్‌తో వస్తోంది. రెండేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్, 4 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాను ఇచ్చారు. సెల్ఫీల కోసం 5 ఎంపీ కెమెరా ఉంటుంది. 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తోంది. 33 వాట్స్ అడాప్టర్‌ను ఉచితంగా ఇస్తున్నారు. ఈ ఫోన్ ఐపీ52 రేటింగ్‌తో వస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!